Rapido And Uber Safety Features: మహిళల భద్రత ప్రస్తుతం అత్యంత తీవ్రమైన సమస్యగా మారింది. ప్రభుత్వం, అనేక ట్యాక్సీలను అందించే సంస్థలు దీనికి సంబంధించి నిరంతరం చర్యలు తీసుకుంటున్నాయి. బైక్ లేదా కార్ ట్యాక్సీలో ప్రయాణించేటప్పుడు మహిళలు పూర్తి భద్రతను పొందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ర్యాపిడో, ఉబర్ తమ కస్టమర్లతో పాటు మహిళా డ్రైవర్లకు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఉబర్ ఇటీవల తన సేఫ్టీ పాలసీని మార్చుకుంది. మహిళలకు ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఎదురైనప్పుడు ఉబర్ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఇచ్చింది. దీని ద్వారా కేవలం ఒక క్లిక్‌తో నేరుగా పోలీసులకు కాల్ వెళ్తుంది.


ఉబర్ తీసుకొచ్చిన సేఫ్టీ ఫీచర్లు
ఉబర్ తన రైడింగ్ యాప్‌లో ఆడియో రికార్డింగ్ ఫీచర్‌ను జోడించింది. దీంతో పాటు యాప్ ఫీచర్లలో ప్రత్యేకించి రాత్రిపూట ప్రయాణించే మహిళల కోసం ఉమెన్ రైడర్ ప్రిఫరెన్స్ (డబ్ల్యూఆర్‌పీ) ఆప్షన్‌లో ప్రత్యేక మార్పులు చేశారు. డబ్ల్యూఆర్‌పీలో మార్పుతో ఉబర్ మహిళా డ్రైవర్లు ప్రత్యేకంగా మహిళా ప్రయాణికుల నుంచి బుకింగ్‌లను అనుమతించవచ్చు.



Also Read: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


దీంతో పాటు ప్రజలు ట్యాక్సీలో అసౌకర్యంగా భావిస్తే లేదా ఏదైనా భద్రత సంబంధిత సమస్యను ఎదుర్కొంటే వారు ఇప్పుడు తమ ట్రిప్ ఆడియోను యాప్‌లోనే రికార్డ్ చేయవచ్చు. డ్రైవర్, ప్రయాణీకుడు ఇద్దరూ ఈ రికార్డింగ్ చేయగలరు. సెక్యూరిటీ రిపోర్టులో ఈ రికార్డింగ్‌ను సమర్పించే హక్కు ఇద్దరికీ ఉంటుంది.


ర్యాపిడోలో భద్రతా ఫీచర్లను ఎలా ఉపయోగించాలి?
ర్యాపిడోలో ప్రయాణిస్తున్నప్పుడు లొకేషన్ ట్రాకింగ్‌తో పాటు, సేఫ్టీ ఆప్షన్ కూడా అందిస్తున్నారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ర్యాపిడో భద్రతా టూల్‌కిట్‌కి చేరుకుంటారు. ఈ టూల్‌కిట్‌లో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఉంది. ఏదైనా సమస్య ఉంటే ర్యాపిడో ఎస్ఓఎస్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు. అలాగే ఈ టూల్‌కిట్‌లో పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ 112 ప్రత్యేక ఆప్షన్ కూడా దిగువన ఇచ్చారు. మీరు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయవచ్చు. ఒక్క క్లిక్‌తో పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి ఫీచర్ల కారణంగా ఉబర్, ర్యాపిడోల్లో సేఫ్టీ మరింత మెరుగు కానుంది.



Also Read: స్కోడా కైలాక్ రేటు రివీల్ అయ్యేది అప్పుడే - డెలివరీ ఎప్పుడు వస్తుంది?