Ram Kapoor Becomes First Indian To Own Lamborghini Urus SE: ప్రముఖ టీవీ & బాలీవుడ్ నటుడు రామ్ కపూర్‌, తమ కొత్త కారుతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఇటీవల, అతను కొత్త అల్ట్రా-హై-ఎండ్ లగ్జరీ హైబ్రిడ్ SUV "లాంబోర్గిని ఉరుస్‌ SE"ని కొనుగోలు చేశాడు. దీని ధర రూ. 5.21 కోట్లుగా చెబుతున్నారు. ఈ మోడల్‌ను కొనుగోలు చేసిన మొదటి భారతీయుడిగా రామ్‌ కపూర్‌ రికార్డ్‌ సృష్టించాడు. అంటే.. భారతదేశంలోనే అత్యంత ధనవంతులు అయిన అంబానీ, అదానీ దగ్గర కూడా ఈ కారు లేదు.

తన కొత్త కారు లాంబోర్గిని ఉరుస్‌ SE దగ్గర తన భార్య గౌతమి కపూర్‌తో కలిసి నిలబడి తీయించుకున్న ఫొటోను రామ్‌ కపూర్‌ తన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటో వెంటనే వైరల్‌ అయింది, ఈ కారు ధర, ఫీచర్ల గురించి దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. రామ్‌ కుమార్‌ తన భార్యతో కలిసి కొత్త కారు దగ్గర సెలబ్రేట్‌ చేసుకున్నట్లు ఆ ఫొటోను బట్టి తెలుస్తోంది.

కారు లుక్ & స్టైల్ ఎలా ఉంది?ఈ విలాసవంతమైన SUV కోసం రామ్ కపూర్ "వెర్డే జియా" (Verde Gea) అనే ప్రత్యేకమైన ఆకుపచ్చ పెయింట్ ఫినిషింగ్‌ను ఎంచుకున్నాడు, ఇది భారతీయ రోడ్లపై ఏ బండిపైనా కనిపించదు. కారు లోపలి భాగంలో బోల్డ్ ఆరెంజ్‌ కలర్‌ అసెంట్‌తో కూడిన స్లీక్‌ బ్లాక్‌ నలుపు థీమ్‌ను ఎంచుకున్నారు. ఈ లుక్‌ ప్రీమియం & పెర్ఫార్మెన్స్‌ పరిపూర్ణ కలయికను చూపిస్తుంది.

ఇంజిన్ & హైబ్రిడ్ టెక్నాలజీరామ్ కపూర్ కొత్త లాంబోర్గిని ఉరుస్‌ SE SUV 4.0L ట్విన్-టర్బోచార్జ్‌డ్‌ V8 ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 620 hp పవర్ & 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 25.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో యాడ్‌ అింది, మొత్తం అవుట్‌పుట్‌ను 800 hp & 950 Nmకి తీసుకువెళుతుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేసిన ఈ SUV ఒక లగ్జరీ వాహనం మాత్రమే కాదు, ఒక పవర్‌హౌస్ కూడా. దీని హైబ్రిడ్ సిస్టమ్ దీనిని వేగవంతమై, ఫ్యూయల్‌-ఎఫిషియెంట్‌ & అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కారులా మారుస్తుంది. ఈ వాహనం సూపర్‌కార్ లాంటి పెర్ఫార్మెన్స్‌ అందిస్తుంది, అదే సమయంలో SUVలో ఉండే సౌకర్యాన్ని & స్పేస్‌ను కూడా ఆస్వాదించవచ్చు.

విలాసవంతమైన లోపలి భాగంఈ హై-ఎండ్ SUVలో అల్ట్రా ప్రీమియం అప్‌హోల్‌స్టెరీ, టచ్‌ స్క్రీన్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ అడ్జస్ట్‌మెంట్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 3D సౌండ్ సిస్టమ్ & సెన్స్-రెస్పాన్సివ్ డ్రైవింగ్ మోడ్స్‌ వంటి ఫ్యూచరిస్టిక్‌ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ లగ్జరీకి కొత్త నిర్వచనాన్ని ఇస్తాయి & డ్రైవింగ్ అనుభవాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళతాయి.

రామ్ కపూర్ కార్ల కలెక్షన్వాస్తవానికి, రామ్‌ కపూర్‌ కార్ల ప్రేమికుడు. అతని దగ్గర హై-ఎండ్ కార్ కలెక్షన్‌ ఉంది. ఇప్పటికే Porsche 911 Carrera S, Mercedes-AMG G63, BMW X5 & Audi Q7 కార్లు రామ్‌ కుమార్‌ గరాజ్‌లో ఉన్నాయి.