Car Maintenance Guide India: వీకెండ్ వచ్చిందంటే చాలామందికి మొదటి ఆలోచన - ఒక రోడ్ ట్రిప్. సిటీ హడావుడి నుంచి బయటపడి కొండకోనల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఈ హడావిడి నుంచి ఉపశమనం కోరుకుంటారు. అయితే... రోడ్ ట్రిప్ కోసం ప్లాన్ చేయడమంటే బ్యాగులు సర్దుకోవడం, హోటల్ బుకింగ్ చేసుకోవడం మాత్రమే కాదు… మీ కార్‌ను కూడా అలాగే సిద్ధం చేయాలి. ఎందుకంటే, లాంగ్ డ్రైవ్‌లో కారుపై పడే ప్రభావం ఎక్కువ. చిన్న పొరపాటు జరిగినా అయినా ట్రిప్ మొత్తం ఇబ్బందులు తెస్తుంది. అందుకే ఈ చెక్‌లిస్ట్‌ను తప్పకుండా ఫాలో అవ్వండి.
హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌లైట్స్: నైట్ డ్రైవ్‌లో లైట్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలియువతలో ఎక్కువ మంది తెల్లవారుజామున లేదా రాత్రి డ్రైవ్ చేయడం ఇష్టపడతారు. కాబట్టి కార్‌లోని హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌లైట్స్, బ్రేక్ లైట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయా అని ముందుగానే చెక్ చేసుకోండి. లైట్లలో డిమ్ లేదా ఫ్లికర్ కనిపించినా వెంటనే రీప్లేస్ చేయడం మంచిది. హైవేపై ఇవే మీ ప్రధాన సేఫ్టీ.
ఎయిర్ కండిషనింగ్: అసలు కాంప్రమైజ్ కావద్దులాంగ్ డ్రైవ్‌లో AC పనిచేయకపోతే ప్రయాణం మొత్తం కష్టమవుతుంది. కాబట్టి... AC కూలింగ్, ఫిల్టర్ కండిషన్, బ్లోవర్ ఎఫిషియెన్సీని వెంటనే చెక్ చేయించుకోండి. లాంగ్ డ్రైవ్‌లో చిరాకు లేకుండా AC పెద్ద రిలీఫ్ ఇస్తుంది.
ఇంజిన్ ఆయిల్, కూలెంట్, ఇతర ఫ్లూయిడ్స్లాంగ్ డ్రైవ్‌కు బయలుదేరే ముందు ఇంజిన్ ఆయిల్ లెవెల్ తప్పకుండా చెక్ చేయాలి. కూలెంట్ లెవెల్ తక్కువగా ఉంటే, కారు ఓవర్‌హీట్ అవ్వడం సాధారణం. బ్రేక్ ఆయిల్, పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్, వాషర్ ఫ్లూయిడ్ అన్నీ ఓకేనో, కాదో చూసుకోవాలి.
వైపర్ బ్లేడ్‌లు: ఎప్పుడైనా వర్షం పడొచ్చుఇది తుపానుల కాలం. కాబట్టి వర్షం ఎప్పుడైనా కురువొచ్చు. ముఖ్యంగా, అడవులు - కొండ ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షం పడే అవకాశం ఉంటుంది. వైపర్ బ్లేడ్‌లు సరిగ్గా గ్లాస్ క్లియర్ చేస్తున్నాయా, స్ట్రీక్స్ వస్తున్నాయా చూడండి. అవసరమైతే బ్లేడ్‌లను రీప్లేస్ చేయండి.
ఫస్ట్ ఎయిడ్ కిట్: చిన్నదే, అయినా అత్యవసరంప్రతి కార్‌లో ఒక ఫుల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. అందులో... బాండేజీలు, యాంటిసెప్టిక్ క్రీమ్, పెయిన్ రిలీవర్ టాబ్లెట్లు, గాజ్ రోల్స్ వంటి బేసిక్ మెడికల్ ఐటమ్స్ ఉండేలా చూసుకోండి.
టైర్లు & వీల్స్: లాంగ్ డ్రైవ్‌లో ఇవే అసలు హీరోటైర్లలో ట్రెడ్ డెప్త్ సరిగ్గా ఉందా, సైడ్‌వాల్‌లో మడతలు ఉన్నాయా, ఏదైనా గుచ్చుకుపోయిన గుర్తులు ఉన్నయా అనేవి చెక్ చేయాలి. ట్రిప్ మొదలు పెట్టే రోజునే టైర్ ప్రెజర్ చెక్ చేయించుకోండి. స్పేర్ టైర్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి, అది మీ కారులో ఉండాలి. వీల్ అలైన్‌మెంట్ తప్పనిసరిగా చేయించాలి. కొండ ప్రాంతాలకు వెళ్లే వాళ్లు టైర్ హెల్త్ విషయంలో డబుల్ చెక్ చేయాలి.
హార్న్: ఇండియన్ రోడ్లపై లైఫ్ సేవర్హైవేలో హార్న్ పనిచేయకపోతే సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది. కొండ ప్రాంతాల్లో ఉండే హెయిర్‌పిన్ టర్న్స్‌లో హార్న్ చాలా ముఖ్యం. వైర్లు సరిగ్గా కనెక్ట్ అయ్యాయా, సౌండ్ క్లియర్‌గా వస్తుందా చూసుకోండి.
నావిగేషన్ యాప్స్ & బ్యాకప్ మ్యాప్‌లుGoogle Maps / Apple Maps ఉండటం మంచిదే. కానీ నెట్‌కనెక్టివిటీ లేకపోయే ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆఫ్‌లైన్ మ్యాప్స్ డౌన్‌లోడ్ చేయండి. అదనంగా ఒక పేపర్ మ్యాప్ కూడా పెట్టుకుంటే బెటర్.
ఇన్‌కార్ ఎంటర్‌టైన్‌మెంట్: లాంగ్ డ్రైవ్‌కు చాలా అవసరంమ్యూజిక్ లేకుండా లాంగ్ డ్రైవ్ బోరింగ్ అవుతుంది. కేబుల్స్, పవర్‌బ్యాంక్, బ్లూటూత్ సెట్టింగ్స్ అన్నీ ముందుగానే చెక్ చేసుకోండి.
అండర్‌కారేజ్ చెక్: చాలా మంది మిస్ చేసే ముఖ్య విషయంసర్వీస్ సెంటర్‌లో కార్ కింద భాగాన్ని చెక్ చేయించండి. ఆయిల్ లీకేజ్, ఫ్యూయల్ లైన్ లీక్, ఎగ్జాస్ట్ సమస్య వంటివి చూడండి. ఇవన్నీ లాంగ్ డ్రైవ్‌కు పెద్ద రిస్క్.
స్పేర్ పార్ట్స్: చిన్నవైనా ఇవీ చాలా అవసరంఫ్యూజ్‌లు, బల్బులు, అడిషనల్ కేబుల్‌లు, మొబైల్ ఛార్జర్ మస్ట్. ఫ్యూజ్ బ్లో అయితే వెంటనే మార్చుకోవచ్చు.
ఇలా కార్‌ను ముందుగానే సరిగ్గా సిద్ధం చేసుకుంటే, మీ వీకెండ్ రోడ్ ట్రిప్ మొత్తం ఫుల్ ఎంజాయ్‌మెంట్ + సేఫ్‌గా సాగుతుంది. హాయ్ ఏ హ్యాపీ జర్నీ.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.