Volkswagen India Discounts November 2025: నవంబర్‌ 2025 ఆఫర్‌లలో వోక్స్‌వ్యాగన్‌ ఇండియా మళ్లీ ఫుల్‌ స్పీడ్‌లో దూసుకొచ్చింది. Tiguan, Taigun, Virtus కొనాలని చూస్తున్న కస్టమర్లకు ఈ నెలే బెస్ట్‌ ఛాన్స్‌ అని చెప్పాల్సిందే. నగదు తగ్గింపు, ఎక్స్‌చేంజ్‌ బోనస్‌, స్క్రాపేజ్‌ ఆఫర్‌, లాయల్టీ బెనిఫిట్స్‌.. ఇలా ఒకే ప్యాకేజీలో చాలా ఆఫర్‌లను ఈ కంపెనీ ప్రకటించింది. డిమాండ్‌ ఉన్న కార్లపై కూడా మంచి తగ్గింపులు ఉన్నాయి చూసుకోండి.

Continues below advertisement

Volkswagen Tiguan ఆఫర్లు – రూ. 3 లక్షల వరకు

వోక్స్‌వ్యాగన్‌ ఫ్లాగ్‌షిప్‌ SUV టిగువాన్‌ R Line‌ కొనే వాళ్లకు భారీగా రూ. 3 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో:

Continues below advertisement

క్యాష్‌ డిస్కౌంట్‌: రూ. 2 లక్షలు

లాయల్టీ బోనస్‌: రూ. 50,000

ఎక్స్‌చేంజ్‌ బోనస్‌: రూ. 50,000, లేదా

స్క్రాపేజ్‌ బెనిఫిట్‌: రూ. 20,000

టిగువాన్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో స్టైలిష్‌గా, ప్రాక్టికల్‌గా ఉండే SUV. 49 లక్షల రూపాయల ఎక్స్‌-షోరూమ్‌లో లాంచ్‌ అయిన ఈ SUV ఇప్పుడు ఈ భారీ తగ్గింపులతో మరింత అట్ట్రాక్టివ్‌గా మారింది. ఫ్యామిలీ లగ్జరీ SUV కొనాలని చూస్తున్న వాళ్లకు ఇదో మంచి డీల్‌.

Volkswagen Taigun ఆఫర్లు – రూ. 2 లక్షల వరకు

మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌లో బెస్ట్‌ సెల్లర్‌ అయిన టైగన్‌పై కూడా తగ్గింపులు బాగానే ఉన్నాయి.

1.0 TSI వేరియంట్స్‌ మీద రూ. 1.50 లక్షల వరకు బెనిఫిట్స్‌

2024 MY వేరియంట్స్‌పై రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లు

టాప్‌లైన్‌ MT మోడల్స్‌పై హయ్యెస్ట్‌ సేవింగ్స్‌

లాయల్టీ బోనస్‌: రూ. 20,000

ఎక్స్‌చేంజ్‌ బోనస్‌ రూ. 30,000, లేదా 

స్క్రాపేజ్‌ బెనిఫిట్‌ రూ. 20,000

1.5 TSI GT Plus వేరియంట్స్‌ మీద మాత్రం క్యాష్‌ డిస్కౌంట్లు లేవు. కానీ లాయల్టీ & ఎక్స్‌చేంజ్‌/స్క్రాపేజ్‌ బెనిఫిట్స్‌ లభిస్తాయి

Chrome & Sport GT Plus వేరియంట్స్‌పై రూ. 1 లక్ష వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.

స్పోర్టీ డిజైన్‌, టర్బో ఇంజిన్‌ పెర్ఫార్మెన్స్‌ కోసం చూస్తున్న యువతకు టైగన్‌ ఒక ఆకర్షణీయమైన మోడల్‌. ఈ నెల ఆఫర్లు బయ్యర్లకు మరింత బూస్ట్‌ ఇస్తున్నాయి.

Volkswagen Virtus ఆఫర్లు – రూ. 1.50 లక్షల వరకు

విర్టస్‌ సెడాన్‌ను కొనాలని చూసే కస్టమర్లకు కూడా ఈ నెల మంచి అవకాశం.

టాప్‌లైన్‌ 1.0 TSI వేరియంట్‌పై రూ. 1.50 లక్షల వరకు ఆఫర్

MY2025 హైలైన్‌ మోడళ్లపై రూ. 80,000 వరకు బెనిఫిట్స్‌

ఇతర వేరియంట్స్‌పై లాయల్టీ & ఎక్స్‌చేంజ్‌ ఆఫర్లు లభిస్తాయి

1.5 TSI GT Plus Chrome & Sport వేరియంట్స్‌పై రూ. 50,000 వరకు ఆఫర్

పెర్ఫార్మెన్స్‌, కంఫర్ట్‌, స్టైల్‌ కలిపి కావాలనుకునే సెడాన్‌ యూజర్లకు విర్టస్‌ ఆల్‌రౌండ్‌ ఎంపిక.

ఈ డిస్కౌంట్లు నగరం వారీగా, స్టాక్‌ ఆధారంగా మారవచ్చు. కాబట్టి మీ దగ్గరలోని Volkswagen డీలర్‌ని సంప్రదించి కచ్చితమైన ఆఫర్లు చెక్‌ చేసుకోవడం మంచిది. ఈ నవంబర్‌ ఆఫర్లతో Volkswagen కారు కొనాలనుకునే వారికి ఇది గోల్డెన్‌ టైమ్‌ అని చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.