Nissan Magnite Easy Shift Price: నిస్సాన్ మోటార్స్ ఇండియా నవంబర్ 30వ తేదీ వరకు చేసిన బుకింగ్స్ కోసం కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఈజీ షిఫ్ట్ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ప్రారంభ ధరలను ప్రకటించింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.49 లక్షలుగా నిర్ణయించారు. మనదేశంలో అత్యంత పోటీ ఉన్న మాగ్నైట్ అత్యంత పోటీతత్వ విభాగంలోకి వస్తుంది. టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి వాటితో పోటీపడుతుంది.


మైలేజీ ఎంత?
మాగ్నైట్ స్మూత్ డ్రైవ్, డ్యూయల్ డ్రైవింగ్ మోడ్, క్రీప్ ఫంక్షన్, యాంటీ స్టాల్, కిక్ డౌన్ ఫీచర్లతో వస్తుంది. నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ మాన్యువల్ వేరియంట్‌తో లీటరుకు 19.35 కిలోమీటర్ల మైలేజ్, ఈజెడ్-షిఫ్ట్ వేరియంట్‌తో లీటరుకు 19.70 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు. నిస్సాన్ మాగ్నైట్ ఈజీ షిఫ్ట్ ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్‌వీ, ఎక్స్‌వీ ప్రీమియం వేరియంట్‌ల్లో అందుబాటులో ఉంది. ఇటీవల నిస్సాన్ మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ కూడా లాంచ్ అయింది. నిస్సాన్ మాగ్నైట్‌ను కొత్త డ్యూయల్ టోన్ బ్లూ, బ్లాక్ కలర్ స్కీమ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.


నిస్సాన్ మాగ్నైట్ ఈజీ షిఫ్ట్ లాంచ్‌తో... నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు 1.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్‌లో మాన్యువల్, ఈజీ షిఫ్ట్ 1.0 లీటర్ టర్బో ఇంజిన్‌లో మాన్యువల్, సీవీటీ ఆప్షన్లతో సహా నాలుగు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.


నిస్సాన్ మాగ్నైట్... సీషెల్స్, బంగ్లాదేశ్, ఉగాండాతో సహా మొత్తం 15 ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇటీవలే బ్రూనైలో కూడా ప్రారంభించారు. అదనంగా ఇటీవలి సంవత్సరాలలో నిస్సాన్ దాని ప్రాథమిక ఎగుమతి మార్కెట్‌ను యూరప్ నుంచి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలకు మార్చింది.


మరోవైపు భారతదేశంలో 2023 ఏప్రిల్‌లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు అమ్మకాల్లో దూసుకుపోతుంది. కేవలం ఏడు నెలల్లోనే కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీ మోడల్‌కు సంబంధించిన 75,000 యూనిట్లను విక్రయించింది. ఐదు వేరియంట్లలో (సిగ్మా, డెల్టా, డెల్టా + జీటా, ఆల్ఫా) అందుబాటులో ఉన్న ఈ కారు ప్రారంభ ధర రూ. 7.5 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. హ్యాచ్‌బ్యాక్ కొనుగోలు చేయాలని భావిస్తున్న కొనుగోలుదారులను ఆకర్షించడంలో ఈ కారు కచ్చితంగా విజయవంతం అయిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కారు దాని సెగ్మెంట్‌లో అత్యంత చవకైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది.


మారుతి ఫ్రాంక్స్‌ను బలెనో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా తయారు చేశారు. కానీ అమ్మకాల పరంగా ఇది జనాదరణ పొందిన బలెనోను కూడా దాటేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ బలెనో హ్యాచ్‌బ్యాక్ తరహా డిజైన్‌తో పాటు గ్రాండ్ విటారా ఎస్‌యూవీ స్టైలింగ్‌ను కూడా కలిగి ఉంది. కారు దిగువన బంపర్‌పై హెడ్‌లైట్‌లతో పాటు స్ప్లిట్ గ్రిల్ అందించారు. కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌తో ప్రత్యేక టెయిల్‌గేట్ డిజైన్ కారు వెనుక వైపు కనిపిస్తుంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!