మారుతి తన కొత్త బ్రెజాను వచ్చే నెల మనదేశంలో లాంచ్ చేయనుంది. మారుతి లైనప్‌లో విటారా బ్రెజాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కొత్త వేరియంట్‌కు ఎన్నో మార్పులు చేయనున్నారు. గ్లోబల్ సీ ప్లాట్‌ఫాంపై ఈ కారును మారుతి రూపొందించింది. దీని బిల్డ్ క్వాలిటీ మరింత స్ట్రాంగ్‌గా ఉండనుంది. ఎందుకంటే మరింత స్ట్రాంగ్ స్టీల్‌తో ఈ కారును రూపొందించారు.


స్టైలింగ్ పరంగా కూడా ఈ కొత్త బ్రెజా డిజైన్ ఐడెంటిటీ కొత్తగా ఉండనుంది. ముందువైపు కొత్త డీఆర్ఎల్స్, హెడ్ ల్యాంప్ డిజైన్, కొత్త బంపర్లు ఇందులో అందించారు. ఇక వెనకవైపు స్టైలింగ్, అలోయ్ వీల్స్ కూడా కొత్తగా ఉండనున్నాయి. ఇక అన్నిటి కంటే పెద్ద మార్పులు దీని ఇంటీరియర్స్‌కు చేశారు. దీని డ్యాష్ బోర్డు డిజైన్ కూడా ముందున్న వేరియంట్‌తో పోలిస్తే చాలా స్టైలిష్‌గా ఉంది.


కొత్త బలెనో తరహాలోనే ఇందులో కూడా 9 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం అందించారు. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్రీమియం ఆడియో సిస్టంలను అందించారు. కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా చూడవచ్చు. ఈ బ్రెజాలో హెడ్స్ అప్ డిస్‌ప్లేను అందించారు. ఈ విభాగంలో ఈ ఫీచర్ ఉండటం ఇదే మొదటిసారి.


ఈ కారులో సన్‌రూఫ్ కూడా ఉండనుంది. బ్రెజాలో సన్‌రూఫ్ మోడల్ కొనాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్. అయితే ప్రస్తుతానికి టాప్ ఎండ్ మోడల్లో మాత్రమే దీన్ని అందించారు. ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అయితే డీజిల్ వేరియంట్ ప్రస్తుతానికి రాబోవడం లేదు. డ్యూయల్ జెట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇందులో అందించనున్నారు. సామర్థ్యాన్ని పెంచేందుకు మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉండనుంది.


రీసెంట్‌గా ఎక్స్ఎల్6లో కనిపించిన 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్ కూడా ఉండటం ప్రధాన హైలెట్. 5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ స్టాండర్డ్‌గా రానుంది. వచ్చే నెలాఖరులో ఈ కొత్త బ్రెజా లాంచ్ కానుందని సమాచారం.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?