వినియోగదారులకు నచ్చేలా టూవీలర్ వాహన తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, నయా లుక్ తో బైకులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. రాయ్ ఎన్ ఫీల్డ్ కూడా మిగతా బైకులు మాదిరిగానే కొత్త కొత్త బైకులను మార్కెట్లోకి తీసుకొస్తుంది. భారత్ లో ఇప్పటికే రాయల్ ఎన్ ఫీల్డ్ కు మంచి ఆదరణ ఉంది. ఆ ఆదరణను కొనసాగిస్తూ కొత్త వాహనాలను పరిచయం చేస్తోంది.
అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి న్యూ మోడల్ బుల్లెట్ లాంచ్ కాబోతోంది. ‘2023 బుల్లెట్ 350’ పేరుతో భారత మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. సెప్టెంబర్ 1న దీనిని కంపెనీ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ బైక్‌కు సంబంధించి స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. రాబోయే బుల్లెట్ క్లాసిక్ 350తో పలు సారూప్యతలను కలిగి ఉంది. రెండూ ట్విన్ క్రాడిల్ ఫ్రేమ్, J-సిరీస్ ఇంజన్ ను కలిగి ఉన్నాయి. దాని రెట్రోని అలాగే ఉంచుకుంటూ పలు సరికొత్త మార్పులతో విడుదల కాబోతోంది.
మూడు వేరియంట్లలో కొత్త బైక్ విడుదల
రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేసిన తాజా టీజర్ వీడియోలో సరికొత్త మోటార్‌సైకిల్ గురించి పలు వివరాలను బయటకు వచ్చాయి. 2023 బుల్లెట్ 350 మూడు వేరియంట్లలో అందించబడుతుంది. బేస్, మిడ్, టాప్ మోడల్‌లో లభిస్తుంది. 349 cc సింగిల్-సిలిండర్ ఎయిర్, ఆయిల్-కూల్డ్ OHC ఇంజన్ నుంచి పవర్ ను పొందుతుంది. ఇది 20.2 bhp పవర్ తో పాటు 27 Nm గరిష్ట టార్క్ ను అందిస్తుంది. దీనిలో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ను అందించారు.
బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, డ్యూయల్ ఛానల్ ABS సిస్టంను కలిగి ఉంటుంది. ఇంకా LCD డేటా డిస్‌ప్లేతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ముందు19-అంగుళాల స్పోక్డ్ వీల్, బ్యాక్ 18-అంగుళాల స్పోక్డ్ వీల్ ఉన్నాయి. సిల్వర్ అవుట్‌లైన్, హాలోజన్ టర్న్ ఇండికేటర్‌లతో కూడిన వృత్తాకార టెయిల్ ల్యాంప్, ట్యూబులర్ గ్రాబ్ రైల్, సింగిల్-పీస్ సీట్, సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్, సిల్వర్-ఫినిష్డ్ రియర్‌వ్యూ మిర్రర్స్ ను కలిగి ఉంది.
స్విచ్ గేర్ సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అమర్చబడుతుంది. బుల్లెట్ సిరీస్ సరళమైన స్టైలింగ్ అలాగే ఉంచబడింది. ఫ్యూయల్ ట్యాంక్ వైపులా సొగసైన గ్రాఫిక్ ఫినిషింగ్ ను కలిగి ఉంది. అవుట్ గోయింగ్ బుల్లెట్‌తో పోలిస్తే, కొత్త మోడల్ కొత్త ఛాసిస్ కారణంగా తేలికగా ఉంటుంది. పాత UCE మోటారు తొలగించబడినందున కొత్త ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.
‘2023 బుల్లెట్ 350’ ధర ఎంతంటే?
ఇక ధర విషయానికి వస్తే ఎంట్రీ-లెవల్ మిడిల్ వెయిట్ రోడ్‌స్టర్ హంటర్ 350 కంటే ఎక్కువ, క్లాసిక్ 350 కంటే చాలా తక్కువగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది సింగిల్, డ్యూయల్-ఛానల్ ABS ఎంపికలలో విక్రయించబడుతుంది. అయితే, 300 mm ఫ్రంట్ డిస్క్, వెనుక డిస్క్ అందుబాటులో ఉంటుంది. నవంబర్‌లో హిమాలయన్ 450 భారత్ లో లాంచ్ కానుంది.
Read Also: హోండా హార్నెట్ 2.0 వచ్చేసింది - కంపెనీ ఏం మార్పులు చేసింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial