మారుతి సుజుకి వరుసగా కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇటీవలే బ్రెజాను లాంచ్ చేసిన కంపెనీ త్వరలో విటారాను లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. జులై 20వ తేదీన ఈ కారు లాంచ్ కానుందని సమాచారం. ఇది హైరైడర్ కంటే డిఫరెంట్ లుక్‌లో ఉండనుందని తెలుస్తోంది. ముందువైపు, వెనకవైపు డిజైన్ పూర్తిగా కొత్తగా ఉండనున్నాయి.


ఎల్ఈడీ లైటింగ్, కొత్త గ్రిల్, కొత్త బంపర్‌లతో ముందువైపు లుక్ కొత్తగా, స్టైలిష్‌గా ఉండనున్నాయి. గ్లాంజా, బలెనో తరహాలో కాకుండా ఇందులో కొన్ని మార్పులు చేశారు. ఇంటీరియర్ కూడా బాగా మారింది. పనోరమిక్ సన్‌రూఫ్ ఉండనుంది. ఈ ఫీచర్ ఉన్న మొదటి మారుతి కారు ఇదే కానుంది.


హైరైడర్ తరహాలో ఇందులో కూడా 9 అంగుళాల స్క్రీన్ ఉండనుంది. దీంతోపాటు హెడ్స్ అప్ డిస్‌ప్లే కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌యూడీ, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా కూడా ఇందులో ఉండనుంది.


ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో ఈవీ మోడ్ కూడా ఉండనుంది. మారుతి ఇటీవలే విటారా బ్రెజా నుంచి విటారాని తీసేసింది. విటారా పేరుతో కొత్త కారు లాంచ్‌కి అప్పుడే హింట్ ఇచ్చింది. లాంచ్ దగ్గర పడేకొద్దీ ఈ కారు గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.


టొయోటా ఇటీవలే తన హైరైడర్ కారును లాంచ్ చేసింది. ఇప్పుడు మారుతి సుజుకి లాంచ్ చేయబోయే ఎస్‌యూవీ బ్రెజా కంటే కొంచెం పైన ఉండే అవకాశం ఉంది. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లతో విటారా పోటీ పడనుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?