మారుతి తన కొత్త కారుకు పాత పేరును పెట్టనుంది. మారుతి గ్రాండ్ విటారా అనే కొత్త కారును మారుతి మార్కెట్లోకి తీసుకురానుంది. గ్రాండ్ విటారా అనే పేరుతో చాలా సంవత్సరాల క్రితం మారుతి 5-సీటర్ ఎస్‌యూవీని విక్రయించేది. ఇప్పుడు ఇదే పేరుతో కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ రానుంది.


మారుతి ఇటీవలే విటారా పేరును బ్రెజా నుంచి తీసేసింది. ఇప్పుడు అదే పేరుతో కొత్త కారును లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఫ్లాగ్‌షిప్ నెక్సా ఉత్పత్తిగా ఎస్-క్రాస్‌ను ఇది ఉత్పత్తి చేయనుంది. రూ.11,000 చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. దీని పూర్తి వివరాలు 20వ తేదీ కల్లా తెలుసుకోవచ్చు.


టొయోటా హైరైడర్‌తో పాటే ఈ కొత్త ఎస్‌యూవీని కంపెనీ డెవలప్ చేసింది. అయితే లుక్స్ మాత్రం కొత్తగా ఉండనున్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, కూల్డ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, హెడ్స్ అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ కారులో అందించే అవకాశం ఉంది.


దీంతోపాటు లేటెస్ట్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం ఉన్న 9 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఇందులో ఉండనుంది. బలెనో, బ్రెజాల్లో కూడా ఇదే అందించారు. ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్సీ ప్లస్ వంటి ఫీచర్లను కూడా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఈ కారులో ఈసీవీటీ గేర్ బాక్స్ ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. దీంతోపాటు స్టాండర్డ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్లు ఉండనున్నాయి. ఏడబ్ల్యూడీ వెర్షన్‌లో మాన్యువల్ వేరియంట్‌లో మాత్రమే ఉండనుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?