మారుతి సుజుకి రానున్న నెలల్లో కొత్త కార్లను లాంచ్ చేయనుంది. ఈ నెలలోనే మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లాంచ్ కానుంది. దీంతోపాటు కొత్త ఎర్టిగాకు సంబంధించిన బుకింగ్స్‌ను కూడా మారుతి ప్రారంభించింది. ఇది ఒక ఫేస్ లిఫ్ట్ కారు. ఇందులో 1.5 లీటర్ల డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ అందించనున్నారు. ఈ కొత్త ఇంజిన్ ఫ్యూయల్ ఎకానమీని కూడా పెంచనుంది.
అయితే కేవలం కొత్త ఇంజిన్ మాత్రమే కాకుండా ఇందులో కొత్త 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్లను కూడా ఈ కారులో అందించనున్నారు. స్టీరింగ్ వీల్ పక్కనే ప్యాడిల్ షిఫ్టర్లు ఉండనున్నాయి. ఈ కొత్త ఆటోమేటిక్ గేర్ బాక్సు పాత మారుతి సుజుకి ఎర్టిగాలోని 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను రీప్లేస్ చేయనుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే... కొత్త మారుతి సుజుకి ఎర్టిగాలో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ అందించనున్నారు. ఇందులో కొత్త ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం కూడా ఉంది. బలెనోలో కూడా ఈ తరహా కనెక్టెడ్ కార్ టెక్నాలజీనే అందించారు. కొత్త మారుతి సుజుకి ఎర్టిగా ఇంటీరియర్లలో పలు మార్పులు చేశారు.
ఈ కొత్త ఎర్టిగా త్వరలో లాంచ్ కానుంది. కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6తో పాటు ఈ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఎక్స్ఎల్6లో కూడా కంపెనీ పలు మార్పులు చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు వెర్షన్ కంటే స్టైలింగ్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. పెద్ద చక్రాలు కూడా ఇందులో ఉండనున్నాయి. కాబట్టి మారుతి ఎర్టిగా కొనాలనుకునేవారు కొన్నాళ్లు ఆగితే కొత్త మోడల్ కొనుగోలు చేయవచ్చు.
కియా కారెన్స్ లాంచ్ అయ్యాక ఎంపీవీ విభాగంలో విపరీతమైన పోటీ నెలకొంది. ఎర్టిగాకు మొట్టమొదటి పెద్ద అప్‌డేట్ ఇదే. ఎక్స్ఎల్6లో కూడా పలు మార్పులు చేయనున్నారు. వీటిలో మారుతి మార్కెట్ షేరును పెంచుకోవాలని చూస్తోంది. దీంతో పాటు రానున్న కాలంలో కొత్త తరహా డిజైన్, మరిన్ని ఫీచర్లతో కొత్త బ్రెజా కూడా లాంచ్ కానున్నట్లు సమాచారం.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?