ల్యాండ్ రోవర్ మనదేశంలో కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ కారును 2023 మోడల్‌గా రిజిస్టర్ చేశారు. అయితే ఈ సంవత్సరం నవంబర్‌లోనే ఈ కారు డెలివరీలు కానున్నాయి. దీని ధరను కూడా కంపెనీ రివీల్ చేసింది. ఇందులో డైనమిక్ ఎస్ఈ వేరియంట్ ధర రూ.1.64 కోట్లు కాగా... డైనమిక్ హెచ్ఎస్ఈ ధర రూ.1.71 కోట్లుగా నిర్ణయించారు. ఆటోబయోగ్రఫీ వేరియంట్ ధర రూ.1.81 కోట్లుగానూ, ఫస్ట్ ఎడిషన్ ధర రూ.1.84 కోట్లుగానూ ఉంది.
ఈ కారులో 13.1 అంగుళాల పీవీ ప్రో ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంను అందించారు. 13.7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. దీని డిజైన్ కూడా స్పోర్టీగా ఉంది. అందుకే ఈ కారుకు స్పోర్ట్ అనే పేరు పెట్టారు. దీని డిజైన్ గతంలో వచ్చిన రేంజ్ రోవర్ స్పోర్ట్ తరహాలోనే ఉంది. సన్నని హెడ్ ల్యాంప్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటి చిన్న చిన్న మార్పులు ఇందులో కొత్తగా ఉండనున్నాయి.
ఇది ఒక పెద్ద లగ్జరీ ఎస్‌యూవీ. ఈ కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్‌లో ఎయిర్ సస్పెన్షన్‌తో పాటు 48 వోల్ట్ ఎలక్ట్రానిక్ యాక్టివ్ రోల్ కంట్రోల్ సిస్టం అందించనున్నారు. ఆల్ వీల్ స్టీరింగ్ ద్వారా టర్నింగ్ సైకిల్ తగ్గనుంది. ఎయిట్ స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఇంటెలిజెంట్ ఆల్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా ఉన్నాయి.
ఈ కారులో సాఫ్ట్ క్లోజ్ డోర్స్‌ను అందించారు. 22 వే అడ్జస్టబుల్, హీటెడ్, వెంటిలేటెడ్ ఎలక్ట్రిక్ మెమరీ ఫ్రంట్ సీట్లు, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్, 29 స్పీకర్లున్న మెరీడియన్ ఆడియో సిస్టం, ఫ్లోటింగ్ 13.1 ఇంచ్ కర్వ్‌డ్ టచ్ స్క్రీన్, 13.7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, అలెక్సా ఫంక్షన్ ఉన్న పివి ప్రో ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, కనెక్టెడ్ కార్ టెక్, 3డీ సరౌండ్ కెమెరా, ముందువైపు, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.
దీని వీల్ బేస్ కూడా పెరిగింది. కాబట్టి కారు వెనకవైపు స్పేస్ పెరగనుంది. ఈ కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ మనదేశంలో 2023లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ కొత్త రేంజ్ రోవర్‌లో డీజిల్, పెట్రోల్ ఇంజిన్లు ఉండనున్నాయి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?