జీప్ కంపెనీ పెద్ద ఫ్లాగ్ షిప్ SUVని దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధం అయ్యింది. గ్రాండ్ చెరోకీ బ్యాడ్జ్ ను సరికొత్తగా పరిచయం చేయబోతున్నది. కొత్త తరం గ్రాండ్ చెరోకీ, మరింత స్టైలిష్ గా ప్రీమియం లుక్ తో వస్తుంది. పూర్తి స్థాయి లగ్జరీ SUVగా విడుదల కానుంది. గ్రాండ్ చెరోకీ కూడా రాంగ్లర్ ప్లస్ కంపాస్, మెరిడియన్‌తో పాటు భారత్ లోనే అసెంబుల్ చేయబడుతుంది.తాజాగా ఈ సరికొత్త గ్రాండ్ చెరోకీ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11న ఈ కారును విడుదల చేయనున్నట్లు తెలిపింది.  


గ్రాండ్చెరోకీ ఇంజిన్ ప్రత్యేకతలు


అంతర్జాతీయ మార్కెట్​లో గ్రాండ్​ చెరోకీ  5.7లీటర్​ వీ8 ఇంజిన్​ తో అందుబాటులో ఉంది.  ఇది 357 బీహెచ్​పీతో 528 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. 2.0 లీటర్​ టర్బోఛార్జ్​ పెట్రోల్​ మోటార్​ ఆప్షన్​ సైతం లభిస్తున్నది. ఈ మోటార్ 375 బీహెచ్​పీతో 637 ఎన్​ఎం టార్క్ ​ను అందిస్తున్నది. అటు 3.6లీటర్​ వీ6 పెట్రోల్​ మోటార్​ లో 294హెచ్​పీతో 348ఎన్​ఎం టార్క్ ను అందిస్తున్నది.


గ్రాండ్చెరోకీ ఫీచర్లు, ధర వివరాలు


జీప్​ గ్రాండ్​ చెరోకీ సరికొత్త మోడల్ సైతం.. పాత వాటితో పోలికను కలిగి ఉంటుంది. చూడ్డానికి మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది.   ఫ్రంట్​ గ్రిల్​ని అద్భుతంగా రూపొందించారు.  ఎల్​ఈడీ హెడ్​ లైట్​ యూనిట్స్​ ఇట్టే ఆకట్టుకునేలా తయారు చేశారు. ఇంటీరియర్ విషయానికి వస్తే మరింత అత్యధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది.  10.25 అంగుళాల​ స్క్రీన్​, యాపిల్​కార్​ ప్లే, ఆండ్రాయిడ్​ ఆటోతో పాటు మరికొన్ని నూతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అటు వెనుక సీట్లలో కూర్చునే వారి కోసం ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. స్ట్రీమింగ్​ సైట్స్​ కూడా అందుబాటులో ఉండేలా రూపొందించారు.అంతేకాదు, ఈ కారులో 4G ఇన్ ​బిల్ట్ ​గా రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. 19 స్పీకర్​ సౌండ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ​


ఇప్పటికే గ్రాండ్చెరోకీ టీజర్  విడుదల


ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన  టీజర్ ను విడుదల చేసింది. జీప్ ఇండియా లైనప్ లో గ్రాండ్ చెకోరి నాలుగో SUVగా  అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే కంపాస్​, వ్రాంగ్​లర్​, మెరీడియన్​ ఎస్యూవీలు భారత మార్కెట్లో సత్తా చాటుతున్నాయి. ఈ మూడు కార్లు టయోటా కంపెనీకి చెందిన ఫార్చునర్ వాహనానికి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి.   


ఏ కార్లతో పోటీ పడుతుందంటే?


కొత్త గ్రాండ్ చెరోకీ Mercedes-Benz GLE, BMW X5,  ఆడి Q7తో సహా లగ్జరీ క్లాస్‌ లో చాలా SUVలతో పోటీపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 7-సీటర్ వెర్షన్ కూడా ఉంది. అయితే, 5-సీట్ల వేరియంట్‌ ను మాత్రమే భారత్ లో విడుదల చేయబోతున్నది.  ఇక ఈ లేటెస్ట్ కారుకు సంబంధించిన ధర వివరాలను విడుదల సందర్భంగా జీప్ ఇండియా వెల్లడించనుంది.


Read Also: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ సేఫ్టీ కార్ల లిస్టు ఓసారి చూడండి!