హ్యుండాయ్ త్వరలో కొత్త కారును లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అది వెన్యూ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అని సమాచారం. హ్యుండాయ్ వెన్యూ లాంచ్ అయిన దగ్గర నుంచి చిన్న అప్‌డేట్స్ మాత్రమే వచ్చాయి. ఇదే మొదటి పెద్ద అప్‌డేట్. దీని లుక్, ఫీచర్లు కూడా వేరే లెవల్‌లో ఉండనున్నాయి. ఐఎంటీ ట్రాన్స్‌మిషన్ వెర్షన్ కూడా త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.


అయితే ఈసారి కొత్త వెన్యూలో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ వినూత్నంగా ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. కొత్త జనరేషన్ టస్కన్ తరహాలో దీని ఇంటీరియర్ ఉండనుంది. అలాగే క్రెటా షేడ్స్ కూడా ఇందులో చూడవచ్చు.


కొత్త గ్రిల్ మాత్రమే కాకుండా బంపర్ కింద భాగంలో కూడా కొత్తగా ఉండనుంది. సైడ్ వ్యూలో పెద్దగా మార్పు లేదు. వెనకవైపు లైట్ బార్‌ను టెయిల్ ల్యాంప్స్‌కు కనెక్ట్ చేశారు. ఈ కారుకు కొత్త స్టైలింగ్ హైలెట్ ఇదే. ఇంటీరియర్ లుక్‌ను ఇంకా పూర్తిస్థాయిలో రివీల్ చేయలేదు.


అయితే ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్‌ను అందించారు. దీంతోపాటు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా ఉంది. కొత్త కనెక్టెడ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇంజిన్ విషయంలో పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించలేదు.


1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఇందులో ఉండనున్నాయి. అయితే కొత్త ఎన్-లైన్ ట్రిమ్‌ వేరియంట్ కూడా ఉంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?