హ్యుండాయ్ మనదేశంలో కొత్త తరం టక్సన్ కారును లాంచ్ చేయడానికి సిద్ధం అయింది. అల్కజార్ కంటే ప్రీమియం రేంజ్‌లో ఉండనున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఇదే. ఈ కొత్త టక్సన్‌లో మార్పులు ఎక్కువగా చేశారు. దీని లుక్ కూడా ప్రీమియంగా ఉండనుంది. మరింత పొడవైన వీల్ బేస్‌ను కొత్త హ్యుండాయ్ టక్సన్‌లో ఉండనుంది.
సెవెన్ సీటర్ లే అవుట్‌తో ఈ కారు లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇక స్టైలింగ్ విషయానికి వస్తే... పారామెట్రిక్ గ్రిల్‌ను ఇందులో అందించారు. డీఆర్ఎల్స్ కూడా గ్రిల్‌లోకి హైడ్ అయి ఉండటం కొత్త హ్యుండాయ్ టక్సన్ స్పెషాలిటీ. ఈ కారు వెనకవైపు ల్యాంప్స్ కూడా పెద్దగా, వైడ్‌గా ఉండనున్నాయి. స్టైలింగ్ థీమ్ ముందు వెర్షన్ హ్యుండాయ్ టక్సన్ తరహాలోనే ఉండనుంది.
వెనకవైపు హిడెన్ వైపర్స్ ఉన్న మొదటి హ్యుండాయ్ కారు ఇదే. కొత్త హ్యుండాయ్ టక్సన్ ఇంటీరియర్‌లో కూడా చాలా మార్పులు చేశారు. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉండనుంది. కనెక్టెడ్ కార్ టెక్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, 64 కలర్ యాంబియంట్ లైటింగ్‌లు కూడా ఉన్నాయి.
ఈ టక్సన్ ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్. అప్ డేట్ చేసిన బ్లూలింక్ సహా లేటెస్ట్ ఫీచర్లు ఎన్నిటినో ఇందులో అందించారు. త్రీ జోన్ క్లైమెట్ కంట్రోల్‌ను కూడా ఉంది. సేఫ్టీ పరంగా చూసుకుంటే ఏడీఏఎస్‌ను ఇందులో పరిచయం చేయనున్నట్లు సమాచారం.
లాంచ్‌కు దగ్గరయ్యే కొద్దీ కొత్త హ్యుండాయ్ టక్సన్‌లో ఏయే ఫీచర్లు అందించనున్నారో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో ఈ కారు మనదేశంలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారు గ్లోబల్ వెర్షన్‌లో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందించారు. మనదేశంలో 2.0 లీటర్ పెట్రోల్, 2.0 డీజిల్ ఇంజిన్ మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటిలో మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి. ఈ కారు ధర గురించి వివరాలు తెలియరాలేదు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?