Honda City Facelift 2023 Launched: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కార్ల తయారీదారు కంపెనీ హోండా ఎట్టకేలకు తన కొత్త 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త సెడాన్ ధరల గురించి చెప్పాలంటే రూ. 11.49 లక్షల నుంచి రూ. 20.39 లక్షల మధ్య దీన్ని ధరను నిర్ణయించారు. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్‌నే. ఈ కారు SV, V, VX, ZX అనే నాలుగు ట్రిమ్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంచింది. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు, E20కి అనుగుణంగా హోండా రెండు ఇంజిన్‌లను అప్‌డేట్ చేసింది. అలాగే ఇప్పటికే వస్తున్న డీజిల్ ఇంజన్ కూడా ఆపేశారు.
ADAS టెక్నాలజీ కూడా
కొత్త సిటీ మోడల్లో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ కూడా అందించారు. దీనితో పాటు మీరు సూట్‌లో 360 డిగ్రీ సెన్సార్, మిటిగేషన్ బ్లైండ్ స్పాట్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అన్ని ఫీచర్లను చూడవచ్చు.
సెక్యూరిటీ ఫీచర్లుగా హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ యాంగిల్ రియర్ వ్యూ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్, ఓఆర్వీఎం మౌంటెడ్ లేన్ వాచ్ కెమెరా కూడా ఉన్నాయి. దీంతో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్, పీఎం 2.5 క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ కూడా హోండా సిటీలో కనిపిస్తాయి.
కొత్త హోండా సిటీ ఇంజిన్
కొత్త హోండా సిటీ ఇంజన్, పవర్ గురించి చెప్పాలటే ఇందులో 1.5 లీటర్ ఎన్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఇది 118 bhp పవర్, 145 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆప్షన్‌లో రానుంది. అదే సమయంలో ఇది దాదాపు లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. కొత్త సిటీకి హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఇందులో కంపెనీ లీటరుకు 26 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందించగలదని పేర్కొంది. ఈ సెగ్మెంట్‌లో ఇది ఏకైక కారు.
కొత్త హోండా సిటీ డిజైన్ కలర్ ఆప్షన్స్
కొత్త సిటీ డిజైన్ గురించి చెప్పాలంటే, అందులో చిన్న మార్పులు చేశారుజ ఇందులో అప్‌డేట్ అయిన ఫ్రంట్, రియర్ బంపర్‌లు, కొత్త హనీకోంబ్ గ్రిల్, కొత్త డిజైన్ ఉన్న 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి. మోడల్ లైనప్ కొత్త అబ్సిడియన్ బ్లూ కలర్ స్కీమ్‌ను కూడా పొందింది. ఇతర కలర్ ఆప్షన్లలో ప్లాటినం వైట్ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మెటిరాయిడ్ గ్రే మెటాలిక్ ఉన్నాయి.
ఇక మారుతీ సుజుకి 2023 ఫిబ్రవరిలో మొత్తం 1,72,321 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో ఐదు శాతం పెరుగుదల నమోదైంది. దేశీయ మార్కెట్లో కంపెనీ గతేడాది ఇదే నెలలో 1,50,823 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరిలో కంపెనీ ఆల్టో, ఎస్-ప్రెస్సో 21,875 యూనిట్లలు అమ్ముడుపోయాయి. కాంపాక్ట్ విభాగంలో 79,898 యూనిట్లు, ఎస్‌యూవీ విభాగంలో 33,550 యూనిట్లను మారుతి సుజుకి విక్రయించింది. అయితే కంపెనీ ఎగుమతులు మాత్రం 2022 ఫిబ్రవరిలో 24,021 యూనిట్ల నుంచి 17,207 యూనిట్లకు తగ్గాయి.