New Honda Amaze 2024 First Drive Review: హోండా అమేజ్ కొత్త మోడల్ అనేక గొప్ప ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. కొత్త అమేజ్ 4 సిలిండర్ ఇంజన్ కలిగిన మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ఈ ఇంజన్ 90 పీఎస్ పవర్, 110 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏడీఏఎస్ ఫీచర్‌తో వస్తున్న అత్యంత చవకైన కారు హోండా అమేజ్. ఇది రూ. ఎనిమిది లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో లాంచ్ అయింది.
అన్నింటి కంటే ముఖ్యంగా లుక్ గురించి చెప్పాలంటే హోండా అమేజ్‌ని ఎలివేట్, సిటీ కార్ల కాంబినేషన్ అని పిలుస్తారు. కారులో ఎల్ఈడీ లైట్లు, 15 అంగుళాల చక్రాలు అందించారు. కారులో ఉన్న పెద్ద ఫ్రంట్ గ్రిల్ కారణంగ ఈ కారు ఎలివేట్ లాగా కనిపిస్తుంది. అదే సమయంలో వెనుక నుండి కారు చూడటానికి హోండా సిటీలా కనిపిస్తుంది. ఈ కారులో కొత్త డిజైర్ లాగా సన్‌రూఫ్ లేదు. దీంతో పాటు ఈ కారులో 360 డిగ్రీ కెమెరా కూడా లేదు. కానీ ఈ కారు ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
హోండా అమేజ్ ఇంటీరియర్ ఎలా ఉంది?
కారు లోపలి భాగం చాలా ఆధునికమైనది. డిజైన్ చూడటానికి హోండా సిటీలా ఉంటుంది. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌తో డ్యాష్‌బోర్డ్ డిజైన్ ఆసక్తికరమైన టచ్‌ని ఇస్తుంది. ఈ కారులో హోండా సిటీ లాగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇందులో ప్రధాన హైలైట్ ఎనిమిదిఅంగుళాల టచ్‌స్క్రీన్, ఇది బేసిక్ లుక్‌లో ఉంటుంది. ఈ కారులో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, రియర్ కెమెరా, ఏడీఏఎస్ ఫీచర్లు, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే (Apple CarPlay), ఆండ్రాయిడ్ ఆటో (Android Auto) ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారులో వైర్‌లెస్ ఛార్జర్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
హోండా అమేజ్ ఇంజిన్ ఇదే...
కొత్త హోండా అమేజ్‌లో 1.2 లీటర్ పెట్రోల్, 4 సిలిండర్ ఇంజన్ ఈ20తో అందించారు. ఇది 90 పీఎస్ పవర్, 110 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కారులో రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కారు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 18.65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. హోండా అమేజ్ ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది. దీనితో ఈ కారు 19.46 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. కానీ కారును నడిపిన తర్వాత మీరు రియల్‌టైమ్‌లో 12 నుంచి 13 కిలోమీటర్ల మైలేజీని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!