Vida VX2 Electric Scooter Price Range And Features: ప్రస్తుతం, ఇండియన్‌ మార్కెట్‌లో, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (EVs) ట్రెండ్‌ నడుస్తోంది. 'హీరో మోటోకార్ప్' ఎలక్ట్రిక్ సబ్-బ్రాండ్ 'విడా' కూడా పూర్తి సన్నాహాలతో ఈ రేసులో పాల్గొంటోంది. ఈ కంపెనీ, తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడా VX2 ను రేపు (మంగళవారం, జులై 1, 2025‌) మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. ఈ లాంచ్‌కు ముందే, విడా, తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ నుంచి అనేక టీజర్లను విడుదల చేసింది, ఈ స్కూటర్‌లో ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయన్న విషయంపై ఒక ఓవర్‌లుక్‌ అందించింది.

Vida VX2 లో మొదట చెప్పుకోవాల్సిన విషయం - ఈ స్కూటర్‌ చాలా వేరియంట్లలో లాంచ్‌ కాబోతోంది & ప్రారంభ ధర పెట్రోల్ స్కూటర్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. 

మూడు రంగుల్లో విడా VX2 విడా కంపెనీ, VX2 ను మూడు ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల చేస్తోంది, అవి - నలుపు, తెలుపు & ఎరుపు. యంగ్‌ కస్టమర్లను & స్టైలింగ్‌ మీద ఎక్కువ దృష్టి పెట్టే వాళ్లను ఆకర్షించడానికి ఈ కలర్స్‌ ఎంచుకున్నారు. ఈ మూడు రంగుల లుక్‌ ఎలా ఉంటుందన్నది సోషల్ మీడియాలో విడుదలైన టీజర్‌లలో కనిపించింది.

డ్రమ్ & డిస్క్ బ్రేక్ వేరియంట్లు విడా VX2 లో భద్రతపైనా ఫోకస్‌ పెట్టారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్ల ఆధారంగా, ఈ స్కూటర్‌లో ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ & డిస్క్ బ్రేక్ ఆప్షన్స్‌ రెండూ అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఈ లెక్కన, విడా VX2 చాలా వేరియంట్లలో విడుదల అవుతుందని, బేస్ మోడల్‌లో డ్రమ్ బ్రేక్ & టాప్ వేరియంట్‌లో డిస్క్ బ్రేక్ ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు.

విడా VX2 ప్రో, ప్లస్, గో విడా కంపెనీ.. VX2 PRO, VX2 PLUS & VX2 GO వంటి పేర్ల కోసం ట్రేడ్‌మార్క్‌లను దాఖలు చేసింది. దీని అర్థం ఈ వేరియంట్‌లలో బ్యాటరీ పరిమాణం, మోటారు శక్తి, పరిధి & వేగంలో తేడాలు ఉండవచ్చు. కస్టమర్లకు, తమ అవసరాలు & బడ్జెట్ ప్రకారం వీటిలో ఒక ఆప్షన్‌ ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

విడా వీఎక్స్2 ధర విడా VX2 రేటు, ప్రస్తుతం ఉన్న విడా V2 కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. రిపోర్ట్స్‌ ప్రకారం, విడా VX2 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 70,000 వరకు ఉండవచ్చు, ఇది భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధర ఉన్న బ్రాండెడ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తుంది. ఫుల్‌ ఛార్జ్‌తో దీని రేంజ్‌ ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది.

ఏ బండ్లకు పోటీగా వస్తోంది?భారతదేశంలో ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు Ather Rizta, Bajaj Chetak 3001, TVS iQube, Ola S1X & Honda QC1 EVలకు పోటీగా Vida VX2 రంగంలోకి దిగుతోంది. విడా VX2 ధర తక్కువగా ఉంటుంది కాబట్టి, ఇది మార్కెట్‌లో చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.