New Generation Maruti Suzuki Baleno: 2015లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి బలెనో హ్యాచ్‌బ్యాక్ కంపెనీకి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్‌లో ఒకటిగా ఉంది. 2021 చివరి నాటికి మిలియన్ విక్రయాల మైలురాయిని చేరుకుంది. ఇది 2023 మార్చిలో 2 మిలియన్ల మార్కును అధిగమించింది. మారుతి సుజుకి తేలికపాటి హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన మొదటి మోడల్‌గా ప్రసిద్ధి చెందిన ఈ కారు మారుతి భవిష్యత్తు ప్రయత్నాలకు కొత్త దిశను అందించింది. 2017లో కంపెనీ పెర్ఫార్మెన్స్ సెంట్రిక్ బలెనో ఆర్ఎస్‌ను లాంచ్ చేసింది. ఇందులో బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. అయితే బీఎస్6 ఉద్గార ప్రమాణాల అమలు కారణంగా దీని తయారీని 2020 ప్రారంభంలో ఆపేశారు.


ప్రస్తుత బలెనో ఇలా...
2019లో కొన్ని చిన్న అప్‌డేట్‌లు, 2022లో ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ పొందిన తర్వాత బలెనో మోడల్ లైనప్ ప్రస్తుతం సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా ట్రిమ్‌లను కలిగి ఉంది. వీటి ఎక్స్ షోరూమ్ ధరలు రూ.6.61 లక్షల నుంచి రూ.9.88 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో 90 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.2 లీటర్ 4 సిలిండర్ డ్యూయల్ జెట్ కే12ఎన్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది.


ఇప్పుడు కంపెనీ మారుతి బలెనోలో జనరేషన్ అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. వైటీఏ అనే కోడ్‌నేమ్‌తో కూడిన కొత్త మోడల్ 2026లో షోరూమ్‌ల్లోకి రానుంది. ఇది మంచి స్టైలింగ్, ఇంటీరియర్‌ను పొందుతుందని అంచనా. అయినప్పటికీ దాని కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌పై దృష్టి సారిస్తుంది. తాజా మీడియా నివేదికల ప్రకారం టయోటా బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో పోల్చితే మారుతి సుజుకి తక్కువ ఖర్చుతో కూడిన హైబ్రిడ్ ఇంజిన్‌ను సిద్ధం చేస్తోంది.


కొత్త హైబ్రిడ్ సిస్టమ్ కొత్త జెడ్12ఈ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 1.5 కేడబ్ల్యూహెచ్ - 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటారుతో రూపొందించారు. ఇది ఫ్రంట్ ఫేస్‌లిఫ్ట్‌తో 2025లో ప్రీమియర్‌గా మార్కెట్లోకి రానుంది. కొత్త సుజుకి హెచ్ఈవీ తర్వాత 2026, 2027లో స్పేసియా ఆధారిత ఎంపీవీ, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లు వస్తాయి. మారుతి సుజుకి హైబ్రిడ్ టెక్నాలజీతో ఆరు కంటే ఎక్కువ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలని యోచిస్తోంది. ఇది 2023 నాటికి మొత్తం వార్షిక అమ్మకాలు ఎనిమిది లక్షల యూనిట్లు చేరేందుకు దోహదం చేస్తుంది.


మరోవైపు భారతదేశంలోని అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలు మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ సంవత్సరం దేశంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేయబోతున్నాయి. మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, నెక్స్ట్ జనరేషన్ డిజైర్‌లను 2024లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది కాకుండా వాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ కూడా త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇది ఇటీవలే టెస్టింగ్ సమయంలో కనిపించింది. హ్యుందాయ్ ఈ సంవత్సరాన్ని అప్‌డేట్ చేసిన క్రెటాతో షురూ చేసింది. దీని తరువాత హ్యుందాయ్ 2024 మధ్య నాటికి క్రెటా ఎన్ లైన్, అల్కజార్ ఫేస్‌లిఫ్ట్‌లను లాంచ్ చేస్తుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!