Children Fell Health Issues Due to Injection in Machilipatnam: ప్రభుత్వాసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా (Krishna) జిల్లా మచిలీపట్నంలోని (Machilipatnam) సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లల విభాగంలో 15 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా.. వారికి రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజెక్షన్ చేశారు. అరగంట తర్వాత చిన్నారులకు తీవ్ర చలిజ్వరం రావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వీరిలో ఏడుగురిని ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.


Also Read: నెల్లూరు జిల్లా ముసునూరులో ఘోర ప్రమాదం - ట్రావెల్ బస్‌ను ఢీ కొట్టిన లారీ- ఏడుగురు మృతి