అంబాసిడర్ కారుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఒకప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు ఇదే. ఆ తర్వాత ఈ కారు తయారీని నిలిపివేశారు. అయితే ఇప్పుడు అంబాసిడర్ కారు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. పూర్తిగా ఎలక్ట్రిక్ సెడాన్‌గా దీన్ని మళ్లీ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement


ప్యూజియోట్ అనే సంస్థ హిందూస్తాన్ మోటార్స్ నుంచి అంబాసిడర్ బ్రాండ్‌ను రూ.80 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కలిసి అంబాసిడర్‌ను కొత్త అవతారంలో తీసుకువస్తున్నాయి. వీరు ఎలక్ట్రిక్ కారుతో పాటు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కూడా రూపొందించనున్నారు.


ఈ ఎలక్ట్రిక్ కారును చెన్నైలో రూపొందించనున్నారు. ఒకప్పుడు మిత్సుబిషి కార్లు తయారు చేసిన ప్లాంట్లోనే దీన్ని తయారు చేయనున్నారు. ఈ అంబాసిడర్ పూర్తిగా డిఫరెంట్ లుక్‌తో రానుంది. ఇంటీరియర్ కూడా మోడర్న్‌గా ఉండనుంది.


ఇది ఎలక్ట్రిక్ కారు కాబట్టి సింగిల్ మోటార్/యాంపిల్ సైజున్న బ్యాటరీ ప్యాక్ అందించనున్నారు. అంబాసిడర్ కారుకు మనదేశంలో ఇంకా మంచి క్రేజ్ ఉంది. ఒకానొక సమయంలో అంబాసిడర్ భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాప్‌లో ఉంది.


మారుతి, ఇతర బ్రాండ్లు రాకముందు దీని మార్కెట్ షేర్ ఏకంగా 70 శాతంగా ఉండేది. అయితే ఇప్పుడు కార్ల రంగంలో పోటీ విపరీతంగా ఉంది. కానీ ఒకప్పుడు అంబాసిడర్‌తో భారతీయులకు ఉన్న కనెక్షన్ దీనికి అతి పెద్ద ప్లస్ కానుంది. అంబాసిడర్ పేరును సబ్‌బ్రాండ్‌గా ఉంచి దీని పేరు మీద మరిన్ని కార్లు లాంచ్ చేసే అవకాశం ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!