New BMW M5 Unveiled: విలాసవంతమైన కార్లకు చిరునామా BMW. ఈ సంస్థ సరికొత్త కారును ఆవిష్కరించింది. BMW M5 పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి లాంచ్ చేసింది. ఈ కారు లేటెస్ట్ జెనరేషన్ కు చెందిన 5 సిరీస్ సెడాన్‌‌ను బేస్ చేసుకుని రూపొందించారు. అయితే, ఇల్యూమినేషన్ తో కూడిని M-స్పెక్ కిడ్నీ గ్రిల్‌, రీడిజైన్ చేయబడిన హెడ్‌ లైట్లు, టెయిల్ లైట్లు, బంపర్లను కలిగి ఉంది. కంపెనీ తొలిసారి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ తో BMW M5ని రూపొందించడం విశేషం.


BMW M5 5 ప్రత్యేకతలు:


1. కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్


BMW M5 అవుట్‌ గోయింగ్ M5  4.4-లీటర్ల V8 టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 727 PS, 1,000 Nmతో కూడిన పవర్ ఫుల్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ తో వస్తోంది. ఈ కారు 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ ను కలిగి ఉంది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోటార్ 18.6 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా పవర్ ను పొందుతుంది. 7.4 kW AC ఛార్జింగ్‌ కు సపోర్టు చేస్తుంది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సెటప్ WLTP-రేటెడ్ ఎలక్ట్రిక్ రేంజ్ 69 కిమీ వరకు అందిస్తుంది. BMW ఆల్ వీల్ డ్రైవ్ (AWD, రియర్ వీల్ డ్రైవ్(RWD) ఆప్షన్స్ లో లభిస్తుంది. కొత్త BMW M5 బరువు 1,970 కిలోల నుంచి 2,510 కిలోలకు పెరిగింది. బ్యాటరీ ప్యాక్, హైబ్రిడ్ టెక్నాలజీని యాడ్ చేయడం వల్లే ఈ బరువు పెరిగిందని కంపెనీ వెల్లడించింది.  


2. ఆకట్టుకునే డిజైన్


MW M5 సరికొత్త డిజైన్ ఎలిమెంట్లను కలిగి ఉంది. చూడ్డానికి 5-సిరీస్ సెడాన్ మాదిరిగానే కనిపిస్తుంది. 5 సిరీస్‌లోని  కార్లలాగే కొత్త LED హెడ్‌ లైట్లను కలిగి ఉంటుంది. కిడ్నీ గ్రిల్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. స్పోర్టీ లుక్ కోసం బ్లాక్ అవుట్ హారిజెంటల్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంది. ADAS కోసం కెమెరా,  రాడార్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫ్రంట్  బంపర్‌ను మరింత స్పోర్టియర్‌గా మార్చారు. ఫ్రంట్ ఫెండర్ నుంచి M బ్యాడ్జ్‌ ను తొలగించింది. అదనంగా బ్యాటరీ ఛార్జింగ్ పోర్ట్‌ ను పొందుతుంది. 20 ఇంచుల ఫ్రంట్, 21 ఇంచుల బ్యాక్ వీల్స్ ను కలిగి ఉంది. కార్బన్ సిరామిక్ బ్రేకులను అప్షనల్ యాక్సెసరీగా ఇచ్చింది. వెనుక భాగంలో కొత్త డిఫ్యూజర్, లుగు ఎగ్జాస్ట్ టిప్స్ ను కలిగి ఉంది. కొత్త 5 సిరీస్ సెడాన్ మాదిరిగానే LED టెయిల్ లైట్లతో వస్తుంది.   


3. లగ్జరీ స్పోర్టీ ఇంటీరియర్


సరికొత్త MW M5 కారులో  మెరినో లెదర్‌తో స్టాండర్డ్‌ గా ఇంటీరియర్ ను రూపొందించారు. ఇన్ఫోటైన్‌మెంట్, ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్కి మధ్యలో కర్వ్డ్ ఇంటిగ్రేటెడ్ డిస్‌ప్లే  హైలైట్ గా ఉంటుంది. రెడ్ స్టార్ట్/స్టాప్ బటన్, M లోగోతో కూడిన రోటరీ డ్రైవ్ కంట్రోలర్, సెంటర్ కన్సోల్‌లో M మోడ్ బటన్‌ ను కలిగి ఉంటుంది. హెడ్ అప్ డిస్ ప్లే కూడా స్టాండర్డ్ ఎక్యుప్ మెంట్స్ ఉన్నాయి. ఇల్యుమినేటెడ్ బటన్లు, పాడిల్ షిఫ్టర్లు, హీటింగ్ ఫంక్షన్‌తో కొత్త ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది.  ఫైవ్-సీటర్ M5లో ఎలక్ట్రికల్ గా అడ్జెస్ట్ చేసుకునే స్పోర్టీ సీట్లతో పాటు బ్యాక్‌ రెస్ట్‌ లో ఇల్యూమినేటెడ్ M బ్యాడ్జ్ ఉన్నాయి. ఆకట్టుకునే అల్కాంటారా రూఫ్‌ను కలిగి ఉంటుంది. పనోరమిక్ సన్‌ రూఫ్ ఉంటుంది. ఫీచర్ సెట్‌ లో వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉంది.   


4.అప్ డేట్ చేసిన ADAS సూట్


BMW M5 రాడార్ బేస్డ్  ADAS సూట్‌ ను  కలిగి ఉంది. ఇందులో ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ విత్ స్టీరింగ్ అసిస్టెన్స్, డ్రైవర్ అటెన్టివ్‌నెస్ అసిస్టెంట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 8 ఎయిర్‌ బ్యాగులు, క్రాష్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది.  






5. ఇండియాలో లాంచింగ్ ఎప్పుడు?     


BMW M5 కారు యూరోపియన్ మార్కెట్‌ లో విడుదల తేదీ ఫిక్స్ చేసుకోగా, భారత్ లో మాత్రం 2025లో వచ్చే అవకాశం ఉంది. దీని ధర దాదాపు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 


 


Read Also: అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న ఓలా నుంచి 4 ఎలక్ట్రిక్ బైకులు, ఇంకా కొన్ని రోజులే వెయిట్ చెయ్యండి