New 2022 Mahindra Scorpio: మహీంద్రా తన ముఖ్యమైన కార్లను ఇండిపెండెన్స్ డే రోజున లాంచ్ చేస్తుంది. గతేడాది స్వాతంత్ర దినోత్సవం రోజున ఎక్స్‌యూవీ700 ధరను కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ సంవత్సరం కొత్త స్కార్పియోను అదే రోజు లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఇందులో కొత్త లుక్, కొత్త ప్లాట్‌ఫాం, కొత్త ఇంజిన్లు ఉండనున్నట్లు సమాచారం.


ఈ స్కార్పియో 2022 ఫీచర్లు కూడా ఎంతో కొత్తగా ఉండనున్నాయి. దీని జనరేషనే పూర్తిగా మారిపోనుంది. స్కార్పియో కూడా కొత్త థార్, ఎక్స్‌యూవీ700 తరహాలో ఉండనుంది. ఈ కొత్త స్కార్పియోను కంపెనీ ఎప్పటినుంచో పరీక్షిస్తుంది. దీని వీల్ బేస్ కూడా పెద్దగా ఉండనుంది. అంటే స్పేస్ కూడా ఎక్కువగానే ఉండనుందన్న మాట.


దీనికి సంబంధించిన ప్రొడక్షన్ వెర్షన్ కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆశ్చర్యపరిచేంత తక్కువ ధరలోనే ఇది లాంచ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న స్కార్పియో కంటే ఈ స్కార్పియో వీల్‌బేస్ పెద్దగా ఉండనుంది.


ఇందులో మూడు వరుసల సీట్లు ఉండనున్నాయి. అయితే ఇవన్నీ ముందువైపుకే ఉండనున్నాయి. ఈ స్కార్పియో ఇంటీరియర్ ఎక్స్‌యూవీ700 తరహాలో ఉండనుంది. పెద్ద టచ్ స్క్రీన్‌ను కూడా ఇందులో అందించనున్నారు. దీంతోపాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.


ఈ కొత్త ప్లాట్‌ఫాంలో రైడింగ్ కంఫర్ట్ ఎక్కువగా ఉండనుంది. దీని సామర్థ్యం కూడా మరింత పెరగనుంది. కొత్త థార్ తరహాలోనే ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లు ఉండనున్నాయి. ఇక దీంతోపాటు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా ఇందులో అందించనున్నారు. ఇక ధర విషయంలో ఇది ఎక్స్‌యూవీ700, థార్‌లకు మధ్యలో ఉండనుంది.


Also Read: Tata Altroz: రూ.8 లక్షల్లోపే టాటా కొత్త కారు, అల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ వచ్చేసింది!


Also Read: Skoda Kodiaq: ఈ సూపర్ హిట్ కారు అవుట్ ఆఫ్ స్టాక్.. 2022లో అస్సలు కొనలేరు!