Petrol Pump Tips: పెట్రోల్ బంకుల వద్ద మోసం జరగడం అనేది భారతదేశంలో సర్వసాధారణం అని చెప్పవచ్చు. ఫ్యూయల్ స్టేషన్లలో ఉద్యోగులు కస్టమర్లను మోసం చేయడం గురించి తరచుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు కొన్నిసార్లు ప్రజలు చెల్లించిన దాని కంటే వారి ట్యాంకుల్లో తక్కువ మొత్తంలో ఇంధనం వెళ్తుంది. చాలా సార్లు కల్తీ ఇంధనాన్ని కూడా నింపుతారు. పెట్రోల్ పంపుల వద్ద జరిగే మోసాలను నివారించడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు, సూచనల గురించి తెలుసుకుందాం.


జీరో ముఖ్యం బిగిలూ
మీ వెహికిల్ ట్యాంక్‌లో ఇంధనాన్ని నింపడం ప్రారంభించినప్పుడు మీటర్‌ని చెక్ చేయండి. మీటర్ జీరో వద్ద ఉందని, ఇంధనం నింపడం ప్రారంభించడానికి ముందు అటెండర్ దాన్ని రీసెట్ చేశారని నిర్ధారించుకోండి.


ఈ విషయంలో జాగ్రత్త
ఫ్యూయల్ నింపేవారు సాధారణంగా చేసే ఒక పని ఏంటంటే తక్కువ పెట్రోల్ కొట్ట ఎక్కువ డబ్బులు తీసుకోవడం. ఉదాహరణకు మీరు రూ. 500 విలువైన ఇంధనాన్ని నింపమని అడిగితే, వారు మీటర్ రూ. 200 దగ్గర ఉన్నప్పుడు నింపడం ప్రారంభించి, రీసెట్ చేసినట్లు నటించవచ్చు.


ఎంత నింపారో చెక్ చేయండి
మీకు పూర్తి ఇంధనం అందడం లేదని మీరు అనుమానించినట్లయితే, ఇంధన పరిమాణాన్ని చెక్ చేయమని ఫ్యూయల్ నింపేవారిని అడగవచ్చు. అటెండెంట్ నింపిన ఇంధనం ఎంత ఉందో చెక్ చేసే పరీక్ష ఇది. ఈ టెస్టులో ఫెయిల్ అయితే మీరు పూర్తి ఇంధనాన్ని పొందడం లేదని అర్థం చేసుకోవచ్చు.


మంచి పెట్రోల్ పంపులో ఇంధనాన్ని నింపండి
వీలైనంత వరకు మీకు బాగా తెలిసిన, నమ్మకం ఉన్న పెట్రోల్ పంపులో ఇంధనాన్ని నింపడానికి ప్రయత్నించండి. మీరు కొత్త ప్రాంతానికి ప్రయాణిస్తున్నట్లయితే ఇది చాలా ముఖ్యం. మంచి నిర్వహణ సిబ్బంది ఉన్న పేరున్న పెట్రోల్ పంపులో మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే మీరు నింపుతున్న ఇంధనం ప్రస్తుత ధరల గురించి తెలుసుకోండి. పెట్రోల్ బంకులో అదే ఛార్జ్ చేస్తుందని కన్ఫర్మ్ చేసుకోండి.


ప్రీమియం పెట్రోల్
కొన్నిసార్లు మీ అనుమతి లేకుండా ఫ్యూయల్ నింపే వ్యక్తి మీ ట్యాంక్‌ను ఖరీదైన ప్రీమియం పెట్రోల్‌తో నింపవచ్చు. పవర్ పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్‌ను పెంచడానికి ప్రత్యేకంగా అడిటివ్స్‌ను ఇది కలిగి ఉంటుంది. ఈ ఇంధనం వాహనం ఇంజిన్‌ను ప్రభావితం చేయదు కానీ మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!