Rolls Royce Cullinan: ముకేష్ అంబానీ కుటుంబీకుల కార్ల సేకరణలో మరో లగ్జరీ కారు చేరింది. ఈసారి ముకేష్ అంబానీ తన మూడో రోల్స్ రాయిస్ కల్లినన్ డెలివరీ తీసుకున్నారు. ఈ ప్రత్యేకమైన రోల్స్ రాయిస్ దాని కస్టమైజేషన్ ద్వారా మాత్రమే మాత్రమే కాకుండా, ప్రత్యేక నంబర్ ప్లేట్, భారీ ధర ట్యాగ్ కారణంగా కూడా స్పెషల్‌గా ఉంటుంది. మెర్సిడెస్ ఏఎంజీ జీ వాగన్, ఎంజీ గ్లోస్టర్‌లను కలిగి ఉన్న అంబానీ దగ్గర ఉంటే ట్రెడిషనల్ సెక్యూరిటీ వాహనాలతో పాటు ఈ కొత్త కారు కూడా కనిపించింది.


ధర, కస్టమైజేషన్ వివరాలు
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ కొత్త రోల్స్ రాయిస్ కల్లినన్ ధర దాదాపు రూ.13.14 కోట్లుగా ఉంది. రోల్స్ రాయిస్ కల్లినన్ బేస్ మోడల్ ధర రూ. 6.8 కోట్లు కాగా, అడిషనల్ ఆప్షనల్ ఫీచర్లు, కస్టమైజేషన్లు కారు మొత్తం ఖర్చును గణనీయంగా పెంచుతాయి. అయితే అంబానీ కుటుంబం ఈ కారు కోసం ఏం కస్టమైజేషన్ చేసిందో తెలియరాలేదు. ఈ కారు ఆకర్షణీయమైన టుస్కాన్ సన్ షేడ్ కలర్‌లో ఉంది. దీని పెయింట్‌వర్క్‌కే దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.


కారు ఆప్షనల్‌గా 21 అంగుళాల చక్రాలను పొందుతుంది. వీటి ధర ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. ఈ కారు కోసం అనేక కస్టమైజేషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అంబానీ కుటుంబం తమ కొత్త రోల్స్ రాయిస్ కోసం ఏ ఆప్షన్ ఎంచుకున్నదో స్పష్టంగా తెలియరాలేదు.


వీఐపీ నంబర్ ప్లేట్
కొత్త కల్లినన్ రిజిస్ట్రేషన్ నంబర్ "0001". ఈ వీఐపీ నంబర్ సాధారణ ధర రూ. నాలుగు లక్షలుగా ఉంది. ప్రస్తుత సిరీస్‌లోని అన్ని నంబర్‌లు ఇప్పటికే తీసేసుకున్నారు కాబట్టి అంబానీ కుటుంబం కొత్త సిరీస్ నుంచి ఈ ఒక నంబర్‌ను ఎంచుకుంది. దీని కారణంగా RTO ఈ రిజిస్ట్రేషన్ నంబర్‌కు మాత్రమే రూ. 12 లక్షల రుసుమును వసూలు చేసింది. రవాణా కమిషనర్ నుంచి రాతపూర్వక అనుమతితో మునుపటి సిరీస్‌ను రద్దు చేయకుండా కొత్త సిరీస్‌ను ప్రారంభించవచ్చని దీనికి ప్రామాణిక రిజిస్ట్రేషన్ ధర కంటే మూడు రెట్లు ఖర్చవుతుందని ఆర్టీవో చెప్పారు.


ఒక నివేదిక ప్రకారం అంబానీ కుటుంబం రూ. 20 లక్షల వన్ టైమ్ ట్యాక్స్‌ను చెల్లించింది. ఈ రిజిస్ట్రేషన్ 2037 జనవరి వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే అదనంగా రూ. 40,000 రోడ్డు భద్రత పన్నుగా చెల్లించారు.


అంబానీ గ్యారేజీలో రోల్స్ రాయిస్ మోడల్స్‌కు సంబంధించి అద్భుతమైన కలెక్షన్ ఉంది. ఇందులో మూడు రోల్స్ రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీలు, కొత్త తరం ఫాంటమ్ ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపేతో పాటు దాదాపు రూ. 13 కోట్ల విలువైన కలెక్షన్ అంబానీ గ్యారేజ్‌లో ఉంది.


ముకేష్ అంబానీ వాడుకుంటారా?
ఈ కొత్త కారు ముకేష్ అంబానీ కోసమే అని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ వాదన బహుశా తప్పు కావచ్చు. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా అంబానీ ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ప్రయాణిస్తారు. ఈ రోల్స్ రాయిస్ బుల్లెట్ ప్రూఫ్ భద్రతను అందిస్తే తప్ప, అంబానీ తన కోసం ఈ వాహనాన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు. అయితే ఈ కొత్త కారు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌లకు ఎంగేజ్‌మెంట్ బహుమతిగా ఉండవచ్చని తెలుస్తోంది.











Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!