Hero first electric bike: ప్రముఖ టూవీలర్‌ తయారీ కంపెనీ Hero MotoCorp, ఒక కీలక ప్రకటన చేసింది. త్వరలోనే ఎలక్ట్రిక్‌ బైక్‌ మార్కెట్లోకి అడుగు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ, తన తొలి ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ను 2027లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. 

Continues below advertisement

ప్రస్తుతం Hero MotoCorp ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో Vida బ్రాండ్‌ కింద స్కూటర్లను విక్రయిస్తోంది. ఇప్పుడు మోటార్‌సైకిల్‌ విభాగంలోకి కూడా ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రెండు ప్రత్యేక ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేస్తోంది.

ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లకు UBEX & VXZ అనే కోడ్ పేర్లు పెట్టారు. వీటి ఆధారంగా వేర్వేరు రకాల ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్లను తీసుకురానున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లు Vida ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా డిజైన్‌ చేసినవి కావు. ప్రత్యేకంగా మోటార్‌సైకిళ్ల అవసరాలకు కోసమే కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు.

Continues below advertisement

UBEX ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీట్ నేకెడ్‌ మోటార్‌సైకిల్‌ను రూపొందించనున్నారు. సాధారణ రోడ్లపై రోజువారీ ప్రయాణానికి అనుగుణంగా ఈ బైక్‌ను తయారు చేస్తారు. VXZ ప్లాట్‌ఫామ్‌ను మరింత హైపెర్ఫార్మెన్స్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్ల తయారీ కోసం ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!

VXZ ప్లాట్‌ఫామ్‌ను అమెరికాకు చెందిన Zero Motorcycles సంస్థ సహకారంతో Hero MotoCorp అభివృద్ధి చేస్తోంది. అడ్వెంచర్‌ బైక్‌లను ఇష్టపడేవాళ్లను, ముఖ్యంగా యూత్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన డిజైన్‌ పేటెంట్ల కోసం కూడా ఇటీవలే అప్లై చేశారు.

ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు పూర్తిగా కొత్తవి కావడం ఇక్కడ కీలకమైన విషయం. Vida స్కూటర్‌ ప్లాట్‌ఫామ్‌ అనుభవాన్ని కొత్త మోటార్‌సైకిళ్ల రూపకల్పనలో ఉపయోగిస్తారు. అయితే.. బైక్‌లకు అవసరమైన పనితీరు, రైడింగ్‌ సామర్థ్యం, ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణించే సామర్థ్యం & రేంజ్‌కు అనుగుణంగా కొత్త సాంకేతికతను ఉపయోగిస్తారు.

ఈ ఏడాది కొత్త ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ రాదని, వచ్చే ఏడాది నుంచి కొత్త బండ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తామని, ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ ప్రాజెక్టుపై కంపెనీ వేగంగా పని చేస్తోందని అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో ఈ బైక్‌లకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు

నిజానికి, హీరో కంపెనీ, తన కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌లను మొదట 2025లో EICMA ప్రదర్శనలో కాన్సెప్ట్‌లుగా చూపించింది. అప్పటి నుంచే UBEX & VXZ మోడళ్లపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు 2027లో తొలి మోడల్‌ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది.

మరోవైపు, తన Vida ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఉత్పత్తిని కూడా భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. FY27లో నెలకు 45,000 Vida స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ భావిస్తోంది. FY26 చివర్లో ఈ సామర్థ్యం నెలకు 15,000 యూనిట్లుగా ఉంది.

అంటే వచ్చే ఏడాది Hero MotoCorp ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించనుంది. Vida స్కూటర్లతో పాటు కొత్త ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్లను తీసుకురావడం ద్వారా EV మార్కెట్లో తన స్థాయిని పెంచుకోవాలని చూస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.