Bajaj Pulsar N160 S, N160 SS: బజాజ్ ఆటో, తన పాపులర్ బైక్ Pulsar N160 సిరీస్‌లో రెండు కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది. Pulsar N160 S & Pulsar N160 SS పేరుతో వీటిని లాంచ్ చేసింది. కొత్త N160 S ధర రూ.1.34 లక్షలు. N160 SS ధర రూ.1.43 లక్షలు, ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.
కొత్త వేరియంట్లతో పాటు ప్రస్తుత స్టాండర్డ్ N160 కూడా అమ్మకాలు కూడా కొనసాగుతాయి. ప్రస్తుత N160తో పోలిస్తే... కొత్త S వేరియంట్ ధర రూ.10,708 ఎక్కువ. టాప్ వేరియంట్ N160 SS ధర రూ.14,089 అధికంగా ఉంది.
కొత్తగా ఏం మారింది?కొత్త Pulsar N160 S & SSలో ప్రధాన మార్పు - ఇంజిన్. ఇందులో కొత్త 164.5cc, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ 4-వాల్వ్ ఇంజిన్‌ను తీసుకొచ్చారు. ఇది 9,500rpm వద్ద 18.5hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 8,000rpm వద్ద 14.5Nm టార్క్ అందిస్తుంది.
ప్రస్తుత 2-వాల్వ్ ఇంజిన్‌తో పోలిస్తే శక్తి 16hp నుంచి 18.5hpకు పెరిగింది. అంటే అదనంగా 2.5hp పవర్ లభిస్తుంది. అయితే టార్క్ మాత్రం 14.65Nm నుంచి 14.5Nmకు స్వల్పంగా తగ్గింది.
ఇది కూడా చదవండి: 5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
మరో కీలక మార్పు థ్రాటిల్ వ్యవస్థ. పాత మెకానికల్ థ్రాటిల్ స్థానంలో ఎలక్ట్రానిక్ థ్రాటిల్‌ను తీసుకొచ్చారు. దీనివల్ల బైక్‌లో వివిధ రైడ్ మోడ్స్‌ను అందించే అవకాశం ఏర్పడింది.
నాలుగు రైడ్ మోడ్స్కొత్త N160 S & SSలో... Road, Rain, Sport & Off-road అనే నాలుగు రైడ్ మోడ్స్ ఉన్నాయి. రైడింగ్ పరిస్థితిని బట్టి వీటిని మార్చుకోవచ్చు. ఇవే కాకుండా Crawl Technology కూడా ఉంది. KTM బైక్‌లలో కనిపించే ఈ టెక్నాలజీ, తక్కువ వేగంతో బైక్‌ను నడిపేటప్పుడు ఉపయోగపడుతుంది. ఎక్కువ గేర్‌లో ఉన్నప్పటికీ తక్కువ క్లచ్ ఇన్‌పుట్‌తో బైక్ ముందుకు కదిలేలా ఇది సహాయపడుతుంది.
N160 SSలో అదనంగా ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. వాలుగా ఉండే రోడ్లపై వెనుక చక్రం అదుపు తప్పకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
సస్పెన్షన్ & బ్రేకుల్లోనూ మార్పులుకొత్త వేరియంట్లలో ముందు భాగంలో 33mm యూనిట్ల స్థానంలో 37mm USD ఫోర్కులు ఇచ్చారు. దీంతో ముందు సస్పెన్షన్ మరింత మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంది. ముందు బ్రేక్ డిస్క్ సైజ్ కూడా పెరిగింది. పాత యూనిట్ స్థానంలో పెద్ద 300mm ఫ్రంట్ డిస్క్ ఇచ్చారు.
మోనోషాక్, 14 లీటర్ల ఇంధన ట్యాంక్, 1,348mm వీల్‌బేస్ & 165mm గ్రౌండ్ క్లియరెన్స్‌లో మార్పులు లేవు. సీటు ఎత్తు 795mmగానే ఉంది. బైక్ కర్బ్ బరువు 151 కిలోలుగా కొనసాగుతోంది.
TFT డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణN160 SSలో మరో ముఖ్యమైన ఫీచర్ వచ్చింది. Bajaj మోటార్‌సైకిళ్లలో తొలిసారిగా 5 అంగుళాల TFT డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఇందులో Google Maps మిర్రరింగ్ సదుపాయం ఉంటుంది.
N160 Sలో మాత్రం LCD కన్సోల్‌నే కొనసాగించారు. టాప్ N160 SSలో అడ్జస్టబుల్ లీవర్లు కూడా ఉన్నాయి. Bluetooth & Wi-Fi కనెక్టివిటీ కూడా లభిస్తుంది.
రంగులు ఇవేకొత్త N160 S & N160 SS వేరియంట్లను మూడు రంగుల్లో - Atlantic Blue, Pearl Metallic White & Brooklyn Black - కొనుగోలు చేయవచ్చు.
మొత్తంగా చూస్తే.. కొత్త Pulsar N160లో కేవలం డిజైన్ మార్పులు మాత్రమే కాకుండా ఇంజిన్, ఎలక్ట్రానిక్ థ్రాటిల్, రైడ్ మోడ్స్, సస్పెన్షన్, బ్రేకులు & కనెక్టివిటీ విషయంలో గణనీయమైన అప్‌గ్రేడ్స్ వచ్చాయి. ముఖ్యంగా N160 SSలో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ & Wi-Fi కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ బైక్‌ను మరింత ప్రీమియం మోడల్‌గా మార్చాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
