Bikes Under 10000 Down Payment: ప్రస్తుత రోజుల్లో రవాణా అనేది ఖరీదుగా మారింది. గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్, చిన్న తరహా ఉద్యోగులకు ప్రతి రోజూ ఆఫీసులు లేదా పనులకు వెళ్లడానికి సొంతంగా బైక్ ఉండటం చాలా అవసరం. అయితే లక్ష రూపాయలకుపైగా వెచ్చించి ఒకేసారి నగదు రూపంలో బైక్ కొనడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి వారి కోసం ఆటోమొబైల్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు సులభతరమైన రుణ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాయి. కేవలం పదివేల రూపాయల ప్రారంభ చెల్లింపుతో కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది.
తక్కువ డౌన్‌పేమెంట్ ప్రయోజనాలు ఏంటీ?
సాధారణంగా వాహన రుణం తీసుకునేటప్పుడు ఎక్కువ మొత్తాన్ని ముందుగానే చెల్లిస్తే మిగిలిన అప్పుపై వడ్డీ భారీ తగ్గుతుంది. కానీ తక్షణమే ఎక్కువ నగదు అందుబాటులో లేని వారికి పదివేల డౌన్‌పేమెంట్ ఆర్‌్ ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. దీని వల్ల చేతిలో ఉన్న తక్కువ నగదుతోనే అవసరమైన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని నెలకు చిన్న చిన్న వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది.
పదివేల లభించే టాప్ బైక్ మోడల్స్
ప్రస్తుతం భారతీయ రోడ్లపై అత్యధిక మైలేజీని, తక్కువ నిర్వహణ ఖర్చులను ఇచ్చే 100cc నుంచి 110cc సెగ్మెంట్‌లో ఐదు ఉత్తమ బైక్‌లు పదివేల డౌన్‌పేమెంట్‌తో అందుబాటులో ఉన్నాయి.
హీరో స్ప్లెండర్ ప్లస్
భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కమ్యూటర్ బైక్ ఇది. దీనిలోని 97.2cc ఇంజన్, i3S టెక్నాలజీ ఇంధన పొదుపు చేస్తుంది. దీని ఆన్ రోడ్ ధర 90వేలు. ఈ బైక్ కొనాలి అంటే పదివేలు డౌన్‌పేమెంట్ చేస్తే మిగతా మొత్తం 80 వేల రూపాయలను 36 నెలలకు తీసుకుంటే 2580 రూపాయలు EMI చెల్లించాలి.
హీరో హెచ్‌ఎఫ్‌డీలక్స్
బడ్జెట్ ధరలో లభించే అత్యంత సరసమైన బైక్ ఇది. రైడర్లు సౌకర్యవంతమైన హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది. దీని అన్‌రోడ్ ధర 75వేల రూపాయలు. పదివేల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, 65వేల రూపాయలు లోన్ మూడేళ్లకు ఏళ్లకు తీసుకుంటే నెలకు 2,090 రూపాయలు చెల్లించాలి.
హోండాషైన్ 100
స్మూత్ ఇంజన్ పనితీరుకు హోండాషైన్ పేరుగాంచింది. దీనిలో ఈఎస్‌పీ టెక్నాలజీ సైలెంట్ స్టార్ట్ ఫీచర్‌ను అందిస్తుంది. 60-65 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ బైక్ ఆన్‌రోడ్ ధర 78ేల రూపాయలు. పదివేలు డౌన్‌పేమెంట్ చెల్లిస్తే, 68 వేల రూపాయలను మూడేళ్లకు లోన్‌గా తీసుకుంటే నెలకు 2190 రూపాయలు చెల్లించాలి.
టీవీఎస్ స్పోర్ట్
ఎక్కువ మైలేజీని కోరుకునే వారికి టీవీఎస్‌్ స్పోర్ట్ మంచి ఎంపిక. దీనిలోని ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ ఇంజన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. 68-70kmpl ఇచ్చే ఈ బైక్ ఆన్‌రోడ్ ప్రైస్ 82వేలు. పదివేలు డౌన్‌పేమెంట్ చేస్తే 72వేలు అప్పుగా తీసుకోవచ్చు. దీన్ని మూడేళ్లకు తీసుకుంటే నెలకు 2320 రూపాయలు చెల్లించాలి.
బజాజ్ ప్లాటినా 110
ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని కోరుకునే వారికి దీనిలోని కంఫర్టెక్ సస్పెన్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 65-70kmpl ఇచ్చే ఈ బైక్ ఆన్‌రోడ్ ధర 84వేల రూపాయలు. పదివేలు డౌన్‌పేమెంట్ చెల్లించి 74వేల రూపాయలను బ్యాంకు లోన్ రూపంలో తీసుకోవచ్చు. దీన్ని మూడేళ్ల కాలపరిమితికి తీసుకుంటే నెలకు 2380 రూపాయలు చెల్లించాలి.
కొత్త బైక్ కొనే ముందు కేవలం షోరూమ్ ధరను మాత్రమే కాకుండా మరికొన్ని ఆర్థిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీ క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు 8.5 నుంచి 9.5 శాతం వంటి తక్కువ వడ్డీ రేటుకే రుణం లభిస్తుంది. అప్పు మంజూరు చేసే సమయంలో బ్యాంకులు 1నుంచి 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తాయి. ఎక్స్‌షోరూమ్ ధర కంటే ఆన్‌రోడ్ ధర భిన్నంగా ఉంటుంది. ఇందులో ఆర్టీవో ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఇతర యాక్సెసరీస్ ఖర్చులు కలిసి ఉంటాయి. రుణం తీర్చుకోవడానికి మీరు ఎంచుకునే సమయాన్ని భట్టి EMI మారుతుంది. 2 ఏళ్లు ఎంచుకుంటే EMI పెరుగుతుంది. కానీ వడ్డీ తగ్గుతుంది. అదే 3ఏళ్లు ఎంచుకుంటే నెలకు కట్టే మొత్తం తగ్గుతుంది. అదే టైంలో చెల్లించే వడ్డీ పెరుగుతుంది. పదివేల డౌన్‌పేమెంట్‌తో బైక్ కొనడం సులభమైన మార్గమే. కానీ దీన్ని పాతికవేలు వరకు పెంచుకుంటే మీకు రుణ, వడ్డీ భారం తగ్గుతుంది.
