Pulsar NS400 Launch: బజాజ్ ఆటో భారత మార్కెట్లోకి కొత్త మోడల్ పల్సర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బజాజ్ లాంచ్ చేయనున్న కొత్త పల్సర్ మోస్ట్ పవర్‌ఫుల్ పల్సర్‌గా నిలవనుంది. ఈ పల్సర్ మోడల్ గురించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ అతి పెద్ద పల్సర్ మోడల్... పల్సర్ ఎన్ఎస్400 అని తెలుస్తోంది. ఈ కొత్త బైక్‌పై ప్రజల్లో క్రేజ్ నెలకొంది.
పల్సర్ ఎన్ఎస్400 మోడల్‌తో పాటు దీని ధర కూడా ఇంకా వెల్లడించలేదు. బజాజ్ పల్సర్‌లో ఆర్ఎస్ 200 ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన బైక్. పల్సర్ ఆర్ఎస్200 ఎక్స్ షోరూమ్ ధర రూ.1.72 లక్షలుగా ఉంది. ప్రస్తుతం పల్సర్ అత్యంత శక్తివంతమైన వేరియంట్ పల్సర్ 250. ఈ పల్సర్ 250లో 249సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది.
మొత్తం బజాజ్ ఆటోకు చెందిన అత్యంత శక్తివంతమైన బైక్ డొమినార్ 400 అని తెలుస్తోంది. ఈ బైక్ 373సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా దీని ఇంజన్‌లో నాలుగు వాల్వ్‌లు, లిక్విడ్ కూల్డ్, డీవోహెచ్‌సీ కూడా ఉన్నాయి.
ఇక బజాజ్ లాంచ్ చేయనున్న అతిపెద్ద పల్సర్ గురించి మాట్లాడినట్లయితే దాని ఇంజిన్‌ను డొమినార్ 400తో కంపేర్ చేయవచ్చు. ఇది పల్సర్ విషయంలో బజాజ్‌కి మెరుగైన స్థానాన్ని అందించడమే కాకుండా, కంపెనీకి ఖర్చును కూడా తగ్గించగలదు.
బజాజ్ ఆటో త్వరలో లాంచ్ చేయనున్న పల్సర్ ఎన్ఎస్400 డొమినార్ 400 కంటే తేలికగా ఉండవచ్చు. బజాజ్ డొమినార్ 400 బరువు దాదాపు 193 కిలోలుగా ఉంది. చిన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 బరువు 158 కిలోలు. డొమినార్ 400 కంటే పల్సర్ ఎన్ఎస్400 బరువు 20 కిలోలు తక్కువగా ఉండవచ్చని అంచనా.
పల్సర్ ఎన్ఎస్400లో కొత్త ఫీచర్లు
బజాజ్ లాంచ్ చేసిన అత్యుత్తమ బైక్‌లలో ఒకటైన పల్సర్ ఎన్ఎస్400, డొమినార్ 400 కంటే మెరుగైన స్థానంలో నిలిచే అవకాశం ఉంది. బజాజ్ లాంచ్ చేసిన ఈ కొత్త మోడల్ ఎల్ఈడీ లైటింగ్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా బ్లూటూత్ కనెక్టివిటీ సౌకర్యం కూడా ఈ పల్సర్ బైక్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌ను మార్చి చివరిలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.