Gst will dicrease on 2 Wheelar Bikes News:  దీపావ‌ళి కానుక‌గా టూ వీల‌ర్ వినియోగ‌దారుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం  తీపి క‌బురు అందించ‌నుంద‌ని తెలుస్తోంది. త‌ర్వాత వారంలో స‌మావేశ‌మ‌య్యే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. సో.. కొద్ది రోజులు ఆగితే, ల‌క్ష రూపాల‌య బైకుపై దాదాపు ప‌ది వేల వ‌ర‌కు టాక్స్ రూపంలో అదా అవుతుంద‌ని నిపుణ‌లు పేర్కొంటున్నారు. మోదీ ప్రభుత్వము దీపావళి వరకు టూ-వీలర్ ధరలను తగ్గించే యోచనలో ఉందని ఇప్ప‌టికే చాలా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. . దీని ప్రకారం బైక్ , స్కూటర్లపై విధించబడే GST 28-31 శాతం నుండి కేవలం 18 శాతానికి తగ్గవచ్చని సూచనలు ఉన్నాయి. ప్రస్తుతానికి పెట్రోలు మీద నడిచే టూ-వీలర్లపై 28 శాతం GST అమలు అవుతోంది. 350 సీసీ కంటే పెద్ద బైక్‌లపై 3 శాతం అదనపు cess ఉంది. దీంతో మొత్తం టాక్స్ 31 శాతం అవుతుంది. కానీ భవిష్యత్తులో ఈ ధరలలో మార్పు చూడగలుగుతామ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మ‌రికొద్ది రోజుల్లోనే దీనిపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. 

Continues below advertisement


నిత్యావ‌స‌ర వ‌స్తువుగా బైక్..
 BikeWale నివేదిక ప్రకారం, ప్రభుత్వం దీపావళి ముందు GST 2.0 కింద టాక్స్ నిర్మాణాన్ని మారుస్తుందని యోచిస్తోంది. అంటే, టూ-వీలర్లపై నేరుగా 18 శాతం GST అమలు చేయబడుతుందని స‌మాచారం. ఆటో రంగం చాలా కాలం నుంచి బైక్‌లను విలాసవంతమైన వస్తువులుగా కాకుండా నిత్య‌వ‌స‌ర‌ సాధనాలుగా పరిగణించాలన్న డిమాండ్ చేసింది. ఇంత‌కుముందు దీనిపై ఎన్నోసార్లు ప్ర‌భుత్వానికి అభ్య‌ర్థ‌న‌లు పంపింది. దీనికి ముందు SIAM 18 శాతం GST ని ప్రతిపాదించింది. దీంతో వినియోగదారులకు ప్రత్యక్ష లాభం కలుగుతుందని ప‌లు సార్లు సూచించింది. . అలాగే కంపెనీలకు కూడా ఇది లాభదాయకంగా ఉంటుందని పేర్కొంది.


అంద‌రి ఫోక‌స్ ఆ భేటీ పైనే..
 GST కౌన్సిల్ సమావేశం సెప్టెంబరు 3-4 మధ్య జరుగనుంది. ఈ రోజుల్లో ఏ వస్తువుకు ఎటు టాక్స్ స్లాబ్ కింద తీసుకువచ్చేది అని నిర్ణయం తీసుకుంటారని తెలుస్తంఓది. బైక్‌లపై టాక్స్ తగ్గినట్లయితే, ఉదాహరణకి 1 లక్ష రూపాయల విలువ ఉన్న బైక్‌పై 10,000 రూపాయల వరకు ఆదా కావచ్చని తెలుస్తోంది. దాదాపు ప‌ది శాతం మేర వినియోగ‌దారులు ఆదా చేసుకోవ‌చ్చ‌ని స‌మాచారం. ఈ టాక్స్ తగ్గింపు వల్ల డిమాండ్ పెరుగుతుందని, ఆటో రంగం మ‌రింత వృద్ధిని సాధిస్తుంద‌ని అంచనాలు ఉన్నాయి.  డిమాండ్ కు స‌రిప‌డేలా ఉత్పత్తి పెరుగిన‌ట్ల‌యితే, ఆటో మోబైల్ రంగం డెవ‌ల‌ప్మెంట్ అంచ‌నాల‌కు మించి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ ప్రక్రియలో పరిశ్రమలో మరింత ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.