Electric Cars: ఎంజీ మోటార్స్ ఇండియా తన ఎలక్ట్రిక్ కారు జెడ్ఎస్ 2023ని దేశీయ మార్కెట్‌లో ఈరోజు విడుదల చేసింది. దీని ధర రూ.27.89 లక్షల (ఎక్స్ షోరూమ్‌) నుంచి ప్రారంభం కానుంది. ఈ కారు ఏడీఏఎస్ లెవల్ 2తో లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ కారు నాలుగు కలర్ ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది. గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, స్టార్రీ బ్లాక్, కాండీ వైట్ రంగులలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు.


ఈ కారులో ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ ఫంక్షన్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా సెక్యూరిటీ ఫీచర్లలో వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన 360 డిగ్రీ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు (డ్యూయల్, ఫ్రంట్, సైడ్, కర్టెన్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం ఉన్నాయి.


ఎంజీ జెడ్ఎస్ ఈవీలో ఎల్ఈడీ హాకీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు, 17 అంగుళాల టోమాహాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీని ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ప్రో అనే మూడు వేరియంట్‌ల్లో కొనుగోలు చేయవచ్చు. ఇస్మార్ట్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీతో వస్తున్న ఈ కారు లోపలి భాగంలో అనేక ఫీచర్లు అందించారు.


10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7.0 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 75కు పైగా కనెక్టెడ్ కారు ఫీచర్లతో కూడిన డిజిటల్ కీ వంటివి ఇందులో ఉన్నాయి. దీంతో పాటు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో సన్‌రూఫ్, ఏసీ, మ్యూజిక్, నావిగేషన్, అనేక ఫీచర్లను ఆపరేట్ చేయడానికి 100కు పైగా వాయిస్ రికగ్నిషన్ కమాండ్‌లు ఇన్‌బిల్ట్‌గా అందించారు. డ్యూయల్ టోన్ ఐకానిక్ ఐవరీ డార్క్ గ్రే కలర్ థీమ్‌లో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. ఎలక్ట్రిక్ కారు వెనుక ఏసీ వెంట్లు, మూడు డ్రైవ్ మోడ్‌లను (ఎకో, నార్మల్, స్పోర్ట్) కూడా అందించారు.


ఈ ఎలక్ట్రిక్ కారును శక్తివంతం చేయడానికి 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదు. ఈ ఈవీపై కంపెనీ ఎనిమిది సంవత్సరాల వారంటీని అందిస్తోంది.  










Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial