MG Windsor Best Selling EV In India: MG విండ్సర్ EV భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మరో కొత్త రికార్డును సృష్టించింది. గత నెల (జులై 2025) లో, ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు 4,308 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది ఇప్పటి వరకు అత్యధిక నెలవారీ సంఖ్య. అంటే, ఈ ఎలక్ట్రిక్ కారుకు డిమాండ్ పీక్ స్టేజ్‌లో ఉందని అర్ధం. దీంతోపాటు, విండ్సర్ వరుసగా 10వ నెల కూడా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన EV టైటిల్‌ను గెలుచుకుంది.
MG Windsor EV స్లీక్ బాడీ షేప్, ఆధునిక ఎయిరోడైనమిక్ డిజైన్‌తో నగర రోడ్లపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. 18-అంగుళాల డైమండ్-కట్ అలాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ & ఎక్స్‌పాండ్ అయ్యే LED లైట్ బార్స్ దీని ప్రీమియం లుక్‌కు మరింత వన్నె కల్పిస్తాయి. గ్లాస్ ప్యానోరమిక్ రూఫ్, 256-రంగుల ఆంబియెంట్ లైటింగ్ & రిక్లైనింగ్ Aero-Lounge రియర్ సీట్లు ఈ కారులో ప్రయాణాన్ని లగ్జరీ అనుభూతిలోకి మారుస్తాయి. స్మూత్ బాడీ లైన్స్‌తో MPV తరహా షేప్ ఉన్నా, SUV స్టైల్ టచ్‌తో MG Windsor EV అద్భుతమైన అర్బన్ ప్రెజెన్స్‌ను ఇస్తుంది.
లాంచ్ నుంచి అద్భుతమైన అమ్మకాలుMG విండ్సర్‌ను అక్టోబర్ 2024లో లాంచ్ చేశారు. ఈ కారు అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం 10 నెలల్లోనే 35,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. కంపెనీ EV మార్కెట్ వాటా Q2 CY2025లో 28% నుంచి 32%కి పెరిగింది. ఈ కాలంలో, విండ్సర్ సగటు నెలవారీ అమ్మకాలు 17% పెరిగాయి.
MG విండ్సర్ లాంచ్ అయిన అక్టోబర్ 2024 నుంచి జులై 2025 వరకు, మొత్తం 35,100 కార్లను కస్టమర్లు కొన్నారు. అంటే, సగటున, ప్రతి నెలా దాదాపు 3,510 యూనిట్లు అమ్ముడయ్యాయి.
కీలక గణాంకాలుడిసెంబర్ 2024లో, MG విండ్సర్ 3,785 యూనిట్లు అమ్ముడయ్యాయి, మే 2025లో ఈ సంఖ్య 3,939 యూనిట్లకు చేరుకుంది. జులై 2025లో 4,308 యూనిట్ల డెలివరీలు జరిగాయి, అమ్మకాలు కొత్త రికార్డును సృష్టించాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఫిబ్రవరి 2025 వంటి నెమ్మదిగా ఉన్న నెలల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ కారు అమ్మకాలు బలంగా ఉన్నాయి.
ప్రీమియం డిజైన్ & ఫీచర్లుMG విండ్సర్ 'ఏరోగ్లైడ్' డిజైన్ కారణంగా దీనికి సెడాన్ తరహా ప్రయోజనం & SUV తరహా ప్రాక్టికాలిటీ రెండూ అందుబాటులో ఉంటాయి. దీనిలో అమర్చిన ఏరో లాంజ్ సీట్లు 135 డిగ్రీల వరకు వంగుతాయి & బిజినెస్ క్లాస్ లాంటి సౌకర్యాన్ని అందిస్తాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే.. 15.6-అంగుళాల గ్రాండ్‌వ్యూ టచ్ డిస్‌ప్లే దీనిలో ఉంది, ఇది అత్యంత గొప్ప అనుభవాన్ని అందిస్తుంది.
ధర బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్ కింద MG విండ్సర్ ధర కేవలం రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, బ్యాటరీ ఛార్జ్ కిలోమీటరుకు 3.9 రూపాయలు. ఈ ప్లాన్ వల్ల, ఈ ప్రీమియం EVకి ఓనర్ కావడం సులభంగా మారుతుంది. అందువల్లే ఎక్కువ మంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ కార్ వైపు మొగ్గు చూపుతున్నారు.