MG Hector Car Discount August 2026: ఈ నెల (ఆగస్టు 2026)లో కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేశారా? అయితే, MG Hector కొనేవాళ్లకు కంపెనీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. హెక్టర్ మన మార్కెట్లోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా, MG ప్రత్యేక యానివర్సరీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా, ఈ నెలలో హెక్టర్ కొనేవారికి రూ.60,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.
ఏడేళ్లు పూర్తి చేసుకున్న MG Hector
MG సంస్థ 2019లో Hector SUVతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఈ కారు మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు, అధునాతన ఫీచర్లు కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి.
అప్పట్లో, పెట్రోల్ & డీజిల్ ఇంజిన్లతో లాంచ్ అయిన Hectorకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. 2022 మే నాటికి ఈ SUV విక్రయాలు 80,000 యూనిట్లను దాటాయి. అదే ఏడాది డిసెంబర్‌లో హెక్టర్ ఉత్పత్తి 1 లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకుంది.
ఇది కూడా చదవండి: ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందంటే?
ఈ నెలలో రూ.60,000 వరకు ప్రయోజనాలు
హెక్టర్ ఏడో వార్షికోత్సవం సందర్భంగా, ఆగస్టు 2026లో ఈ SUVపై రూ.60,000 వరకు ప్రయోజనాలను MG అందిస్తోంది. ఇందులో ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ ఆఫర్లు & యానివర్సరీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఆగస్టు 2026లో హెక్టర్ కొనుగోలు కోసం బుకింగ్ చేసుకునే కస్టమర్లందరూ ఈ ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. అయితే ఒక్కో కస్టమర్‌కు లభించే ప్రయోజనాలు వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. డీలర్‌షిప్ వద్ద పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఫైనాన్స్ కూడా..
MG Hector కొనుగోలుదారులకు ఫైనాన్స్ విషయంలోనూ ప్రత్యేక సౌకర్యాలను ఈ కంపెనీ అందిస్తోంది. కారు ఆన్‌రోడ్ ధరపై 100 శాతం వరకు ఫండింగ్ పొందే అవకాశం ఉంది. గరిష్ఠంగా 84 నెలల కాలవ్యవధితో రుణ సదుపాయం (ఫైనాన్స్) అందుబాటులో ఉంది.
అంతేకాదు, హెక్టర్‌కు సంబంధించిన యాక్సెసరీల కొనుగోలుకు కూడా 100 శాతం వరకు ఫండింగ్ సపోర్ట్ (ఫైనాన్స్) అందిస్తున్నట్లు MG తెలిపింది.
ఇది కూడా చదవండి: నిస్సాన్ గ్రావైట్ CNG రియల్ మైలేజ్ టెస్ట్.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
ధర ఎంత? ఇంజిన్ ఎలా ఉంటుంది?
ప్రస్తుతం MG Hector ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు.
ప్రస్తుతం, హెక్టర్.. 143hp శక్తిని ఉత్పత్తి చేసే 1.5 లీటర్, నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు.
హెక్టర్‌లో 5 సీటర్ & 7 సీటర్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.
MG Hectorకు ఇది ముఖ్యమైన మైలురాయి. భారత మార్కెట్లో MG బ్రాండ్‌కు పరిచయం చేసిన తొలి మోడల్ ఇదే. ఇప్పుడు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకటించిన రూ.60,000 వరకు ప్రయోజనాలు కొత్త కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా, 100 శాతం వరకు ఫైనాన్స్ సదుపాయంతో ఈ నెలలో హెక్టర్ కొనుగోలు మరింత ఈజీగా మారింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
