MG Cyberster Roadster: ఎంజీ మోటార్స్ ఇండియా ఇటీవల తన సైబర్‌స్టర్‌ను ఒక ఈవెంట్‌లో ప్రదర్శించింది. ఎంజీ దాని కాంపాక్ట్ రోడ్‌స్టర్‌ను ఇప్పుడు మార్కెట్లోకి తిరిగి తీసుకువస్తుంది. ఇది కంపెనీకి చాలా ముఖ్యమైన కారు. ఈ కారు కారణంగా కంపెనీ మరింత ప్రజాదరణ పొందింది. సైబర్‌స్టర్ అనేది ఒక చిన్న ఎలక్ట్రిక్ కారు. ఇది చవకైన రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కారు. ఈ కారు సిజర్ డోర్స్‌తో వస్తుంది. కాంపాక్ట్‌గా ఉండటమే కాకుండా ఈ కారు అగ్రెసివ్‌గా, చాలా షార్ప్‌గా కనిపిస్తుంది. అయితే దీనికి ఉన్న సూపర్‌కార్ వంటి సిజర్ డోర్స్ కూడా చాలా బాగున్నాయి. దీని రూఫ్‌ని క్లాత్‌తో తయారు చేశారు. దీన్ని మూసివేయడానికి 10 సెకన్లు మాత్రమే పడుతుంది. ఫాబ్రిక్ రూఫ్ రోడ్‌స్టర్‌ను గుర్తుకు తెస్తుంది.
ఇంజిన్ ఇలా?
ఈ కారు ట్విన్ మోటార్ లేఅవుట్‌తో చాలా వేగంగా ఉంటుంది. ఈ కారు ఏకంగా 510 బీహెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని అర్థం ఎంజీ సైబర్‌స్టర్ టాప్ స్పెక్ చాలా ఫాస్ట్‌గా, స్పోర్ట్స్ కార్లతో సమానంగా ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది ఏకంగా 450 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇది స్పోర్ట్స్ కారుతో పోటీ పడేందుకు సరిపోయిందని అనుకోవచ్చు. రేర్ వీల్ డ్రైవ్‌తో ఒకే మోటారు వెర్షన్ కూడా ఉంది.
ఇండియాకు వస్తుందా?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంటీరియర్‌లో నాలుగు స్క్రీన్‌లతో చాలా టెక్నాలజీని అందిస్తుంది. లోపలి భాగం రెట్రో లుక్‌లో లేనప్పటికీ చాలా లగ్జరీగా ఉంటుంది. సైబర్‌స్టర్ అనేది ప్రపంచ స్థాయిలో కూడా చాలా కొత్త కారు. అయితే ఎంజీ దానిని హాలో కారుగా ఉపయోగిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇది భారతదేశానికి వస్తుందా? అని. ఎందుకంటే ఇది చాలా స్పోర్టీగా ఉన్న కారు కాదు. అలాగే ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారు.
ఇటీవల జరిగిన ఎంజీ ఈవెంట్‌లో ప్రదర్శించిన కారు చాలా ఆకర్షణను పొందింది. పరిమిత సంఖ్యలో హాలో కారుగా, ఎంజీ సైబర్‌స్టర్ దాని లుక్స్, అప్పీల్ కారణంగా సక్సెస్‌ను సాధించగలదని అనుకోవచ్చు. ఇది ఇంపోర్టెడ్ మోడల్ కాబట్టి ధర అంత చవకగా ఉండదు. కానీ పెద్ద వాల్యూమ్‌లను సాధించడం భారతదేశంలో ఎంజీ ప్రధాన లక్ష్యం కాదు. దీని విక్రయాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ సైబర్‌స్టార్ ఖచ్చితంగా కంపెనీకి ముఖ్యమైన ఉత్పత్తి అవుతుంది.
ఎంజీ మోటార్స్ ఇటీవలే 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. కంపెనీ 100వ వార్షికోత్సవం సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా 2024 మోడల్ లైనప్ కోసం కొత్త ధరలను అనౌన్స్ చేసింది. ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఈవీ ధరను ఏకంగా రూ. 1 లక్ష తగ్గించింది. ఎంజీ కామెట్ ఈవీ మునుపటి ధర రూ. 7.98 లక్షలు కాగా, అది ఇప్పుడు రూ. 6.99 లక్షలకు తగ్గింది. ప్రస్తుతం ఎంజీ ఆస్టర్ ధర రూ.9.98 లక్షలుగానూ, ఎంజీ హెక్టర్ ధర రూ.14.94 లక్షలుగానూ, ఎంజీ గ్లోస్టర్ ధర రూ.37.49 లక్షలుగానూ ఉంది.