Joint Integrated Programme in Management Admission Test (JIPMAT) 2024: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బోధ్‌గయ, ఐఐఎం జమ్మూ ఉమ్మడిగా అందిస్తున్న 'ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) - 2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 22లోగా నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.2000 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. జూన్ 6న నిర్వహించే పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.
వివరాలు..
* జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) – 2024
ప్రవేశాలు కల్పించే విద్యాసంస్థలు: ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్మూ.
సీట్ల సంఖ్య: 120. (60 + 60)
కోర్సు వ్యవధి: అయిదేళ్లు.
బోధనాంశాలు: లాంగ్వేజ్ స్కిల్స్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎథికల్ అండర్‌స్టాండిగ్, ఫిజికల్ వెల్ బీయింగ్.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఆర్ట్స్/కామర్స్/సైన్స్ గ్రూప్) ఉత్తీర్ణులై ఉండాలి. 2022, 2023 సంవత్సరాల్లో లేదా 2024 చివరి సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ.2000 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 400 మార్కులకు కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 పశ్నలు ఉంటాయి. వీటిలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 33 ప్రశ్నలు-132 మార్కులు, డేటా ఇంటర్‌ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ నుంచి 33 ప్రశ్నలు-132 మార్కులు, వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 34 ప్రశ్నలు-136 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఇస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి ఒకమార్కు కోత విధిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.04.2024. (05.00 P.M.)
➥ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 22.04.2024. (11.50 P.M.)
➥ దరఖాస్తు సవరణ తేదీలు: 23.04.2024 నుంచి 25.04.2024. (11.50 P.M.)
➥ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్: మే చివరివారంలో.
➥ పరీక్ష హాల్‌టికెట్లు: 02.06.2024.
➥ పరీక్ష తేదీ: 06.06.2024.
JIPMAT 2024 Information Bulletin
ALSO READ:
సీయూఈటీ యూజీ - 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న"కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2024" దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 26తో ముగియాల్సిన గడువును మార్చి 31 వరకు పొడించింది. సరైన అర్హతలున్నవారు మార్చి 31 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈమేరకు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..