MG Comet EV vs Tata Tiago EV: భారత్‌ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల సందడి పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, పెట్రోల్, డీజిల్ ధరల నుంచి తప్పించుకోవడానికి మధ్య తరగతి ప్రజలు ఎలక్ట్రిక్‌ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు ఈ విభాగంలో ప్రస్తుతం రెండు దిగ్గజ మోడళ్లు ఎంజీ కామెట్‌ ఈవీ, టాటా టియాగో ఈవీ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఒకవైపు వినూత్న డిజైన్‌తో కూడిన కామెట్‌, మరోవైపు సంప్రదాయ హ్యాచ్‌బ్యాక్‌ రూపంలో ఉన్న టియాగో మధ్య తేడాను వాటి సామర్థ్యాలను పరిశీలించాల్సిన  అవసరం ఉంది. 

Continues below advertisement

ఎంజీ కామెట్‌, టాటా టియాగో ధరల మధ్య పోలిక

ఎంజీ కామెట్‌ ఈవీ ప్రారంభ ధర 6.31 లక్షలు. దీనికి నెలకు సుమారు 12,073 ఈఎంఐ(ఐదేళ్ల కాలపరిమితికి) పడే అవకాశం ఉంది. టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర 7.99 లక్షలుగా ఉంది. దీని నెలవారీ ఈఎంఐ సుమారు 15.278 రూపాయలుగా ఉంటుంది. అంటే ప్రారంభ ధరలోనే కామెట్‌ సుమారు 1.68 లక్షలు తక్కువగా లభిస్తోంది. 

ఎంజీ కామెట్‌, టాటా టియాగోలో ఫీచర్స్‌ సంగతేంటీ?

ఈ రెండు వాహనాలు కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌పై నడుస్తాయి. అయితే వీటి పనితీరులో గణనీయమైన మార్పులు ఉన్నాయి. ఎంజీ కామెట్‌ ఈవీ 17.3kWh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉండగా, ఇది 41 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టాటా టియాగో ఈవీ 19.2kWh బ్యాటరీతో వస్తుంది. 60bhp శక్తిని అందిస్తుంది. కామెట్‌ వెనుక చక్రాల డ్రైవ్‌, మోటార్‌ వెనుక ఇరుసుపై ఆధారపడి ఉంటుంది. టియాగో ఈవీ ముందు చక్రాల డ్రైవ్‌‌ కలిగి ఉంది. కామెట్‌ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 19.97 సెకనుల్లో అందుకుంటుంది. 

Continues below advertisement

Also Read: విద్యార్థులకు యూజ్ అయ్యే మధ్యతరగతి బడ్జెట్‌ ఎలక్ట్రిక్‌ సైకిళ్లు! స్కూల్‌ వెహికల్స్‌కు కట్టే డబ్బులతో కొనేయొచ్చు!

ఎంజీ కామెట్‌, టాటా టియాగో బ్యాటరీలో ఎవరి పవర్ ఎంత?

ఎలక్ట్రిక్ కార్లను కొనేవారు ప్రధానంగా చూసేది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది అనే అంశం. ఎంజీ కామెట్‌ ఈవీ డ్రైవింగ్ రేంజ్ 230 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. టాటా టియాగో ఈవీ ఎంఐడీసీ సర్టిఫైడ్‌ రేంజ్‌ 223 కిలోమీటర్లు. ఇక్కడ ఆసక్తిరమైన విషయం ఏంటంటే, టాటా టియాగో ఈవీలో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. దీని ద్వారా కేవలం 58 నిమిషాల్లో పది నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ చేయవచ్చు. కామెట్‌లో ఈ వేరియంట్‌లో అటువంటి సమాచారం అందుబాటులో లేదు. 

ఎంజీ కామెట్‌, టాటా టియాగో సైజ్‌ల తేడా

ఎంజీ కామెట్‌ కేవలం 2974 mm పొడవు కలిగిన అత్యంత చిన్న కారు. ఇందులో కేవలం రెండు డోర్స్‌ మాత్రమే ఉన్నాయి. నాలుగు మంది ప్రయాణించవచ్చు. దీని టర్నింగ్‌ రేడియస్‌ కేవలం 4.2 మీటర్లు మాత్రమే ఉండటం వల్ల నగరాల్లో పార్కింగ్‌ చాలా సులభం. టాటా టియాగో 3769 mm పొడవుతో ఒక పూర్తి స్థాయి హ్యాచ్‌బ్యాక్. ఇందులో ఐదు డోర్స్‌, ఐదు మంది ప్రయాణించే వీలుంది. ప్రయాణాల్లో సామాన్లు ఉంచుకోవడానికి 240 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. 

భద్రతలో ఎవరి స్థాయి ఏంటీ

రెండు వాహనాల్లో భద్రత కోసం రెండు ఎయిర్ బ్యాగ్‌లు వస్తున్నాయి. రెండింటిలోనూ ఏబీఎస్‌, ఈబీడి , డిస్క్‌, డ్రమ్‌ బ్రేక్స్ ఉన్నాయి. రెండింటిలోనూ హాలోజన్ హెడ్‌ల్యాంప్స్‌, టైల్ లైట్స్‌ ఉన్నాయి. అయితే కామెట్‌లో డేటైమ్‌ రిన్నింగ్ లైట్స్ అదనంగా ఉన్నాయి. 

కామెట్‌లో డ్యూయల్‌ టోన్ కార్బన్‌ బ్లాక్‌, లైట్‌ వార్మ్‌ గ్రే ఇంటీరియర్‌ ఉండగా, టియాగో ఈవీల ప్రీమియం లైట్ గ్రే, బ్లాక్‌ ఇంటీరియర్‌ లభిస్తుంది. బ్యాటరీపై రెండు కంపెనీలు కూడా 8 ఏళ్ల వారంటీని అందిస్తున్నాయి. 

Also Read: ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV

టాటా మోటార్స్‌ తన టియాగో ఈవీతో ఇప్పటికే మార్కెట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించుకోగా, ఎంజీ మోటార్‌ తన కామెట్‌తో నగర ప్రయాణాలకు సరికొత్త పరిష్కారం అనే నినాదంతో ముందుకు వచ్చింది. అయితే ఒకే కారు కుటుంబం మొత్తానికి , సుదీర్ఘ ప్రయాణాలకు కావాలనుకునే వారికి టియాగో ఈవీ ఒక ప్రాక్టికల్‌ ఆప్షన్‌గా నిలుస్తుంది. 

మీరు తక్కువ ధరలో, స్మార్ట్ ఈవీ కావాలనుకుంటే మాత్రం ఎంజీ కామెట్‌ ఈవీ మంచి ఆప్షన్. ఐదుగురు ప్రయాణించడానికి తగినంత స్థలం, వేగవంతమైన ఛార్జింగ్, ఒక పరిపూర్ణమైన కారు అనుభూతి కావాలనుకుంటే టాటా టియాగో ఈవీ వైపు మొగ్గు చూపవచ్చు. 

Also Read: 10 లక్షల బడ్జెట్‌లోనే టాప్‌ ADAS ఫీచర్‌ కార్లు! పూర్తి వివరాలు ఇవే!