MG కామెట్ EV  బుకింగ్స్ ఓపెన్


MG మోటర్ ఇండియా MG కామెట్ EV బుకింగ్‌లను ప్రారంభించినట్లు వెల్లడించింది. వినియోగదారులు కామెట్ EVని ఆన్‌లైన్‌లో MG మోటార్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. అంతేకాదు, MG డీలర్‌షిప్‌ల ద్వారా కూడా ఈ కారును బుక్ చేసుకోవచ్చని తెలిపింది. బుకింగ్ కు గాను రూ. 11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. కామెట్ వాహనాల డెలివరీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. ‘MyMG’ యాప్‌లో ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీని ద్వారా బుకింగ్ నుంచి డెలివరీ వరకు పూర్తి సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది.  ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు తమ కార్ బుకింగ్‌ నుంచి డెలివరీ అయ్యే వరకు ప్రక్రియను ఫోన్ ద్వారా ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది.


MG కామెట్ EV బుకింగ్స్ ప్రారంభించడం పట్ల MG మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు. "MG కామెట్ EV  పట్టణ వినియోగదారుల అవసరాలను తీర్చే ఉద్దేశంతో అభివృద్ధి చేయబడింది. తొలిసారి మేమే ట్రాక్ అండ్ ట్రేస్ ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చాం. మా కస్టమర్లు వారి కార్ బుకింగ్ నుంచి డెలివరీ వరకు స్టేటస్ ను తెలుసుకోవచ్చు. వినియోగదారులు త్వరలోనే MG కామెట్‌ ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదించనున్నారు” అని తెలిపారు.  


మూడు వేరియెంట్లలో MG కామెట్ EV  


MG కామెట్ EV  ప్రత్యేకమైన ప్రారంభ ధరలో అందుబాటులో ఉంటుంది. పేస్ వేరియంట్ ధర రూ. 7.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్లే, ప్లష్ వేరియంట్‌లు రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంటాయి. ప్రారంభ ఆఫర్ మొదటి 5,000 బుకింగ్‌లకు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. మే నెల చివరి వారం నుంచి   కామెట్ వాహనాలను  దశలవారీగా డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. కామెట్ ఒక్క ఛార్జ్ తో 230 కిలోమీటర్ల  పరిధిని పొందుతుంది.


స్పెషల్ సర్వీసింగ్ ఆఫర్లు అందిస్తున్న MG మోటార్స్


కామెట్ EV ప్రత్యేక MG e-షీల్డ్‌ తో వస్తుంది. ఇది రిపేర్లు, సర్వీస్ ఖర్చులను కవర్ చేస్తూ కంపెనీ ప్రత్యేక ఆఫర్ ను అందిస్తోంది. ఇందుకోసం  3-3-3-8 ప్యాకేజీ అందిస్తుంది. 3 సంవత్సరాలు లేదంటే 1 లక్ష కి.మీ వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA), 3 ఉచిత లేబర్ సేవలను అందిస్తుంది.  IP67 రేటింగ్,  ప్రిస్మాటిక్ సెల్స్‌ తో రూపొందిన 17.3 kWh Li-ion బ్యాటరీ 8 సంవత్సరాలు,  లేదంటే 1 లక్ష 20 వేల కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. అదనంగా, MG కామెట్ EV యజమానులు 80కి పైగా వారంటీ,  సర్వీస్ ప్యాకేజీల నుండి కూడా ఎంచుకోవచ్చు. ఇందుకోసం కేవలం రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. MG కస్టమర్‌లు  తమ తదుపరి MGకి సులభంగా అప్‌గ్రేడ్ చేయడానికి బై-బ్యాక్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. కస్టమర్‌లు ఈ స్పెషల్ ప్యాకేజీని కొనుగోలు చేసినప్పుడు, 3 సంవత్సరాల ముగింపులో, వారు అసలు ఎక్స్-షోరూమ్ విలువలో 60% బై బ్యాక్‌ను పొందే అవకాశం ఉంటుంది.   


Read Also: దేశీయ మార్కెట్లోకి సరికొత్త BMW X1 లాంచ్, ధర రూ.45.90 లక్షల నుంచి షురూ!