Mercedes Benz AMG Electric Car: మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇది చాలా పవర్‌ని జనరేట్ చేయనుంది. ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ బ్యాడ్జ్డ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై పని చేస్తోంది. బ్రిటిష్ ఆటోమోటివ్ పబ్లికేషన్ ఆటోకార్ యూకే ప్రకారం మెర్సిడెస్ రూపొందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు 1000 బీహెచ్‌పీ పవర్‌ని ఇస్తుంది. ఈ కారును 2026 సంవత్సరంలో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది.


కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఏఎంజీ బ్యాడ్జ్‌తో...
జర్మన్ లగ్జరీ కార్ తయారీదారు ఇప్పుడు మెరుగైన పనితీరుతో ఈవీలను మాత్రమే తయారు చేయనుంది. నివేదికల ప్రకారం మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఏ ఇతర మోడల్ లాగా ఉండదు. ఈ గొప్ప పెర్ఫార్మెన్స్ మెర్సిడెస్‌ను ఏఎంజీ ఆధారితంగా తయారు చేయవచ్చు. ఈ కారు విజన్ ఏఎంజీ అంత పెద్దదిగా ఉంటుంది. దీని ప్రకారం ఈ కారు పొడవు దాదాపు 200 అంగుళాలు ఉంటుంది. అలాగే ఈ కారు 118 అంగుళాల వీల్‌బేస్‌తో రావచ్చు.


1000 బీహెచ్‌పీ పవర్‌తో...
మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేయనున్న ఈ కారు ఏఎంజీ ఫ్లాగ్‌షిప్ కింద రావచ్చు. ఈ కారు ఎలా ఉండనుందనేది రాబోయే నెలల్లో కాన్సెప్ట్ రూపంలో బహిర్గతం కావచ్చు. కంపెనీ తన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారాన్ని షేర్ చేయలేదు. ఈ కారులో ఎన్ని మోటార్లు అమర్చుతున్నారో ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రతి యాక్సిల్‌కు రెండు పవర్‌లను అందించే అవకాశం ఉండనుంది. ఈ ఈవీ ఆల్ వెహికల్ డ్రైవ్ సెటప్ (AWD)తో వచ్చే అవకాశం ఉంది. ఈ కారు 1000 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని ఇవ్వగలదు.


ఈ ఎస్‌యూవీ పేరుకు సంబంధించి మెర్సిడెస్ బెంజ్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. నివేదికల ప్రకారం మెర్సిడెస్ బెంజ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తుంది. దీని కోసం కంపెనీ తన జర్మన్ తయారీ ప్లాంట్‌లో కూడా మార్పులు చేసింది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!