ABP CVoter Survey : లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్లో బీజేపీ చేసిన రాజకీయం వర్కవుట్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి నితీష్ కుమార్ ను బయటకు లాగి ఎన్డీఏలో చేర్చుకున్న దానికి భారీగా ప్రతిఫలాన్ని ఎన్డీఏ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్లో వెల్లడయింది.
బీహార్లో ఎన్డీఏకు 33 సీట్లు
బీహార్ లో మొత్తం 40 లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఇందులో 33 సీట్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్లో వెల్లడయింది. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి ఏడు సీట్లు మాత్రమే లభించే అవకాశం ఉంది. పార్టీల వారీగా కూటముల్లో కాంగ్రెస్ ఒక్క సీటులో ..ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు ఆరు సీట్లలో విజయం సాధించనున్నాయి. ఇక బీజేపీ కూటమిలో బీజేపీ అత్యధికంగా 18 లోక్ సభ సీట్లలో గెలుస్తుంది. మిత్రపక్షం అయిన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, అలాకే లోక్ జనశక్తి పార్టీలు కలిసి 18 లోక్ సభ సీట్లు గెల్చుకుంటాయని ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్లో వెల్లజయింది.
సగానికి పైగా ఓట్లు సాధించనున్న ఎన్డీఏ కూటమి
బీహార్లో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. ఆ కూటమికి 50.8 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్లో వెల్లయింది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల ఇండియా కూటమికి 39.9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 9.3 శాతం ఓట్లు సాధిస్తారని అంచనా.
నితీష్ కుమార్ ప్లేట్ ఫిరాయించడంతో ఇండియా కూటమి ఆశలు గల్లంతు
ఇండియా కూటమి తెరపైకి రావడంలో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ ప్లేట్ ఫిరాయించి ఎన్డీఏ కూటమిలో చేరడంతో.. కాంగ్రెస్ పార్టీకి.. ఆర్జేడీకి భారీ నష్టం జరుగుతోందని అనుకోవచ్చు.
(Methodology: Current survey findings and projections are based on CVoter Opinion Poll CATI interviews (Computer Assisted Telephone Interviewing) conducted among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.)