Maruti WagonR Price, Down Payment, Car Loan EMI: ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో బాగా అమ్ముడుపోతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఒకటి. ఈ కారు లాంచ్‌ అయి 25 సంవత్సరాలు అయినా ఇప్పటికీ దీని ప్రజాదరణ తగ్గలేదు. కాలానుగుణంగా, మారుతి, ఈ కారులో మార్పులు చేస్తూ వస్తోంది. ఈ కారు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చడానికి, ఇటీవల, వ్యాగన్ ఆర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణిక ఫీచర్‌గా చేర్చింది. అంటే, మారుతి వ్యాగన్‌ ఆర్‌ బేస్‌ మోడల్‌ కొన్నా ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు వస్తాయి. అందుబాటు ధర, మోడ్రన్‌ మార్పుల కారణంగా.. మధ్య తరగతి కుటుంబాల నుంచి ఆఫీసుకు వెళ్లే వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ దీనిని కొంటున్నారు.

Continues below advertisement


ఆన్-రోడ్ ధర
హైదరాబాద్‌లో, మారుతి వ్యాగన్ ఆర్ బేస్ LXI పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.79 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు రూ. 83,000 రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, దాదాపు రూ. 32,000 బీమా మొత్తం, ఇతర అవసరమైన ఖర్చులను జోడించిన తర్వాత, దీని ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 6.93 లక్షలకు (Maruti WagonR on-road price, Hyderabad) చేరుకుంటుంది. 


విజయవాడలో ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.79 లక్షలు, రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 84,000, బీమా కోసం దాదాపు రూ. 23,000, ఇతర ఖర్చులు చెల్లించిన తర్వాత, దీని ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 6.85 లక్షలు (Maruti WagonR on-road price, Vijayawada) అవుతుంది.


డౌన్ పేమెంట్
మీ క్రెడిట్ స్కోరు బాగుండి బ్యాంకు నుంచి కార్‌ లోన్‌ లభిస్తే, మీరు కేవలం రూ. 1.07 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి వ్యాగన్ ఆర్ కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, విజయవాడలో ఈ డౌన్ పేమెంట్ తర్వాత, మీరు దాదాపు రూ. 5.78 లక్షల కారు రుణం తీసుకోవలసి ఉంటుంది. బ్యాంక్‌ ఈ రుణాన్ని 9% వడ్డీ రేటుతో ఇచ్చిందని అనుకుందాం. ఇప్పుడు EMI ఆప్షన్స్‌ చూద్దాం. 


7 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, నెలవారీ EMI రూ. 9,297 అవుతుంది.


6 సంవత్సరాల్లో లోన్‌ పూర్తి చేయాలంటే, నెలకు రూ. 10,416 EMI చెల్లించాలి.


5 సంవత్సరాల్లో రుణ కాలపరిమితి ఎంచుకుంటే, నెలనెలా రూ. 11,995 EMI బ్యాంక్‌కు కట్టాలి.


4 సంవత్సరాల్లో లోన్‌ క్లియర్‌ చేయదలిస్తే, నెలవారీ EMI రూ. 14,380 బ్యాంక్‌కు చెల్లించాలి.


5 లేదా 6 సంవత్సరాల EMI మధ్య తరగతి కుటుంబాలకు & మొదటిసారి కారు కొనుగోలు చేసేవారికి అందుబాటులో ఉంటుంది. నెలకు రూ.15,000 కట్టగలిగితే, కేవలం 4 సంవత్సరాల్లోనే లోన్‌ క్లియర్‌ చేయవచ్చు.


ఇంజిన్ & మైలేజ్
మారుతి వ్యాగన్ ఆర్ మూడు ఇంజన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది - 1.0 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ & 1.0 లీటర్ పెట్రోల్ + CNG. దీని పెట్రోల్ వెర్షన్ లీటరుకు 25.19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది, CNG వెర్షన్ 34.05 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. ఈ కారులో మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు రెండూ అందుబాటులో ఉన్నాయి, కాబట్టి ఈ కారును నగరంలో & హైవేపై సౌకర్యవంతంగా నడపవచ్చు.


ఫీచర్లు & భద్రత
వాగన్ ఆర్‌ క్యాబిన్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్‌ చేస్తుంది. కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్ & 341 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ కూడా ఉన్నాయి. భద్రత పరంగా, వాగన్ ఆర్ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తుంది, మునుపటి కంటే సురక్షితంగా మారింది. ఇంకా.. EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రియర్‌ పార్కింగ్ సెన్సార్ & రియర్‌ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఈ కారుకు అదనపు భద్రతలు.