Beat Officer Hall Ticket Download | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ అప్డేట్ ఇచ్చింది. ఫార్టెస్ట్ విభాగానికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన హాల్ టికెట్లను నేడు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 691 పారెస్ట్ ఆఫీసర్ పోస్టుల నిమాయకానికి సంబంధించిన రాతపరీక్ష సెప్టెంబర్ 7, 2025న నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి https://portal-psc.ap.gov.in/Download_HallTickets/
ఫారెస్ట్ ఆఫీసర్ హాల్‌టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి- APPSC అధికారిక వెబ్‌సైట్ అయిన appsc.ap.gov.in https://psc.ap.gov.in/ కి వెళ్లాలి. - హోం పేజ్‌లో హాల్ టికెట్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి- కొత్త పేజీలో మీరు లాగిన్ వివరాలు (User ID, Password) నమోదు చేయాలి- "Submit" క్లిక్ చేసిన తర్వాత మీ Hall Ticket స్క్రీన్‌పై కనిపిస్తుంది.- హాల్‌టికెట్‌లోని వివరాలను చెక్ చేసుకుని, సాఫ్ట్ కాపీ డౌన్‌లోడ్ చేసుకోండి.- భవిష్యత్తు అవసరాల కోసం హాల్ టికెట్ ప్రింటౌట్ ఉంచుకోండి.
మీ అడ్మిట్ కార్డ్‌లో ఈ వివరాలు చెక్ చేసుకోవాలిఅభ్యర్థి పేరురిజిస్ట్రేషన్/ రోల్ నంబర్ఫోటో, మీ సంతకంపరీక్ష తేదీ, సమయంరిపోర్టింగ్ టైమ్ఎగ్జామ్ సెంటర్ అడ్రస్
సెప్టెంబర్ 07న జరిగే APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులు ఎగ్జామ్ కోసం అధికారులు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలి. పాటించారని నిర్ధారించుకోవాలి. అభ్యర్థులు రిపోర్టింగ్ సమయానికి ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి.
హాల్ టికెట్, ID ప్రూఫ్ వెంట తీసుకెళ్లడం అసలు మరిచిపోకూడదు. కనుక అభ్యర్థులు మీ అడ్మిట్ కార్డులు, చెల్లుబాటు అయ్యే ఐటో ఐడీ ప్రూఫ్ వెంట తీసుకెళ్లాలని హాల్ టికెట్లో సూచించారు. ఐటీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ పాస్‌పోర్ట్ మొదలైనవి. అనుమతించబడని వస్తువులను పరీక్షా కేంద్రాలలోకి తీసుకెళ్లకూడదని సూచించారు. మీ మొబైల్ ఫోన్, ఇయర్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లు లాంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.