Sachin Tendulkar Lamborghini Urus S: క్రికెట్ దేవుడు సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌, క్రికెట్‌ రికార్డుల మోతతోనే కాదు లగ్జరీ కార్లపై ఇష్టంతోనూ ప్రసిద్ధుడు. బ్యాటింగ్‌ చేసినంత ఈజీగా SUVతో దూసుకెళ్లగలడు. ఒక్క మాటలో చెప్పాలంటే, టెండూల్కర్‌ ఒక ఎక్స్‌పర్ట్స్‌ బ్యాట్స్‌మనే కాదు, డ్రైవర్‌ కూడా. క్రికెట్‌ ఆటను వదిలిపెట్టినప్పటికీ, కార్లపై ఇష్టాన్ని వదల్లేదు సచిన్‌.  ఇటీవల, ఈ క్రికెట్‌ గాడ్‌. ముంబై వీధుల్లో తన మోడిఫైడ్ లంబోర్గిని ఉరుస్ S కారును నడుపుతూ కనిపించాడు. ఈ లగ్జరీ SUV ధర దాదాపు రూ. 4.2 కోట్లు. సచిన్‌, ఈ అల్ట్రా లగ్జరీ కారులో అనేక ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్లు చేయించాడు, దీనిని మరింత శక్తిమంతంగా & స్పోర్టీగా తీర్చిదిద్దాడు.

Continues below advertisement

బ్లూ ఎలియోస్ షేడ్‌లో పవర్‌ఫుల్ లుక్సచిన్ Lamborghini Urus S Blue Eleos షేడ్‌లో ఉంది, ఇది ప్రీమియం లుక్‌ను పెంచింది. టెండూల్కర్‌ ఈ SUVని 2023లో కొన్నాడు, కానీ ఇప్పుడు దానిలో చాలా పెద్ద మార్పులు చేశాడు. గతంలో దీనికి స్టాండర్డ్ సిల్వర్ అల్లాయ్ వీల్స్ ఉండేవి, ఇప్పుడు వాటి స్థానంలో 22-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ బిగించాడు. కార్బన్ ఫైబర్ వింగ్, ఫ్రంట్ స్ప్లిటర్, సైడ్ స్కర్ట్‌లు & రియర్ డిఫ్యూజర్‌లను ఇందులో ఇన్‌స్టాల్ చేశారు, ఇవి దీనికి మరింత స్పోర్టీ & దూకుడైన శైలిని ఇచ్చాయి. ఈ భాగాలు మాన్సోరీ లేదా 1016 ఇండస్ట్రీస్ నుంచి తీసుకున్నాడని భావిస్తున్నారు.

సూపర్‌కార్ లాంటి పనితీరులంబోర్గిని ఉరుస్ S కేవలం ఒక లగ్జరీ SUV మాత్రమే కాదు, పనితీరులో సూపర్‌కార్ కంటే తక్కువ కాదు. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌ కలిగి ఉంది, 666 PS పవర్‌ & 850 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ & ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ SUV కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోవడానికి ఇదే కారణం.

Continues below advertisement

సచిన్‌కి కారు మోడిఫికేషన్ అంటే చాలా ఇష్టంనిజానికి, సచిన్, తన కారును మోడిఫై చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, Porsche 911 Turbo S కి టెక్ఆర్ట్ బాడీకిట్ & శాటిన్ బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చాడు. అతని BMW i8 కూడా ఒక ప్రత్యేకమైన ఆఫ్టర్ మార్కెట్ బాడీకిట్ చేయించి వార్తల్లో నిలిచాడు. సచిన్, తన వ్యక్తిత్వానికి అనుగుణంగా తన కార్లను కస్టమైజ్‌ చేయడానికి ఇష్టపడతాడు.

సచిన్‌ గరాజ్‌లో రేంజ్ రోవర్ SVసచిన్ టెండూల్కర్ కార్ల కలెక్షన్ చాలా విలాసవంతంగా ఉంటుంది. గత సంవత్సరం, దాదాపు రూ. 5 కోట్ల విలువైన Range Rover SV Autobiography కూడా కొనుగోలు చేశాడు. ఈ కారు సెడోనా రెడ్ షేడ్‌లో ఉంది & దాని ఇంటీరియర్‌కు ప్రత్యేక రెడ్ అల్కాంటారా ఫినిషింగ్ ఇచ్చారు. సీట్లపై సచిన్ వ్యక్తిగత లోగో కూడా ఉంది, ఇది ఈ కారును మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇందులో 24-వే అడ్జస్టబుల్ ఎగ్జిక్యూటివ్ సీట్లు, 13.1-అంగుళాల స్క్రీన్ & మెరిడియన్ 3D సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.