భారతీయ మార్కెట్లో బాగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్లలో మారుతి సుజుకి కార్ల బ్రాండ్స్ ఉన్నాయి. మారుతి సుజుకీ కంపెనీ ఈ నెలలో కొన్ని కార్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ కార్ల జాబితాలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Wagon R) కూడా ఉంది. ఈ నెలలో మారుతి కంపెనీకి చెందిన ఈ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో, దాని ధర, ప్రత్యేకతలను ఇక్కడ తెలుసుకోండి.
Maruti Wagon R కొనుగోలుపై ఈ నెల, ఆగస్టు 2025లో మీకు రూ. 1.05 లక్షల వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇందులో నగదు డిస్కౌంట్‌తో పాటు కాంప్లిమెంటరీ వాల్ట్‌జ్ ఎడిషన్ కిట్ ఉన్నాయి.
Maruti Wagon R కారు ధర ఎంత
మారుతి వ్యాగన్ ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.79 లక్షలతో ప్రారంభం అవుతుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 8.50 లక్షల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని CNG వేరియంట్ రూ. 7.15 లక్షలకు ప్రారంభమవుతుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఆన్-రోడ్ ధరలు ఆయా వేరియంట్‌లను బట్టి మారతాయి. దీని ప్రారంభ ధరతో 2025లో చౌకైన, సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌గా చేస్తుంది.
Wagon Rలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వస్తుంది. ఇది Android Auto, Apple CarPlayలకు సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్, ఆటో AC, హైట్ అడ్జస్ట్‌మెంట్ సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు వంటి సౌకర్యాలున్నాయి.
Maruti Wagon R ఇంజిన్ వేరియంట్
మారుతి వ్యాగన్ ఆర్ కారు 3 వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఛాయిస్‌లతో వస్తుంది. ఇది అన్ని రకాల కస్టమర్‌ల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో అధికంగా విక్రయాలు జరుగుతున్న బ్రాండ్లలో ఒకటిగా మారింది. ఇందులో మొదటిది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 65.68 bhp పవర్‌తో పాటు 89 Nm టార్క్ ఇస్తుంది.
రెండవ ఛాయిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 88.5 bhp పవర్‌తో పాటు 113 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మూడవ ఎంపిక 1.0-లీటర్ CNG ఇంజిన్, ఇది 88 PS పవర్2తో పాటు 121.5 Nm టార్క్ ఇస్తుంది. రెండు పెట్రోల్ ఇంజిన్ ఛాయిస్2లు, 5-స్పీడ్ మాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కలిగి ఉంది. అయితే CNG వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే రానుంది. ఈ ఇంజిన్ ఛాయిస్‌లన్నీ అద్భుతమైన పనితీరుతో పాటు బెస్ట్ ఫ్యూయల్ సామర్థ్యాన్ని అందిస్తాయి.
Also Read: రూ.11,000 EMIకే MG Comet EV – బెస్ట్ డీల్ ఉన్నప్పుడు పెట్రోల్ కోసం డబ్బు వృథా చేయడం ఎందుకు?