MG Comet EV Price, Down Payment, Loan and EMI Details: ఎంజీ కామెట్ EV బయటి భాగం బొమ్మలాగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ డిజైనే దీనికి ప్లస్ పాయింట్, ఈ కాంపాక్ట్ డిజైన్ నగరాలలో నడిపేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. స్లీక్ హెడ్‌ల్యాంప్స్, గ్లాస్ స్ట్రిప్ ముందు భాగానికి ఫ్యూచరిస్టిక్ లుక్స్ ఇస్తాయి. షార్ప్ బాడీ లైన్స్ & మినిమలిస్ట్ స్టైల్ ఈ వాహనాన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తాయి. మన దేశంలో అత్యంత తక్కువ ధర ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EV, ఇప్పుడు గతంలో కంటే సురక్షితంగా మారింది & మరిన్ని ఎక్కువ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
రూ. 7 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర ఉన్న MG Comet EV, తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. మీ నెలవారీ జీతం రూ. 30,000 వరకు ఉన్నప్పటికీ, మీరు EMI ఆప్షన్‌లో MG కామెట్ EVని సులభంగా కొనుగోలు చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో MG కామెట్ EV ఆన్-రోడ్ ధర ఎంత? హైదరాబాద్ & విజయవాడలో, కొత్త MG కామెట్ EV ఆన్-రోడ్ ధర (MG Comet EV on-road price, Hyderabad) దాదాపు 7.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి. మీరు, షోరూమ్‌లో రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, మీరు రూ. 6.90 లక్షల కార్ లోన్ తీసుకోవలసి ఉంటుంది. ఈ రుణంపై, బ్యాంక్ వడ్డీ రేటు సంవత్సరానికి 9% అనుకుందాం. ఇప్పుడు, EMI ఆప్షన్స్ చూద్దాం.
7 సంవత్సరాల్లో కార్ లోన్ పూర్తి చేయాలంటే, నెలకు రూ. 11,095 EMI చెల్లించాలి. ఈ 84 నెలల్లో బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 2,42,322 అవుతుంది.
6 సంవత్సరాల్లో రుణం తీర్చేయాలనుకుంటే, నెలకు రూ. 12,431 EMI చెల్లించాలి. ఈ 72 నెలల్లో బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 2,05,374 అవుతుంది.
5 సంవత్సరాల రుణ కాలపరిమితిని ఎంచుకుంటే, నెలకు రూ. 14,316 EMI చెల్లించాలి. ఈ 60 నెలల్లో బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 1,69,302 అవుతుంది.
4 సంవత్సరాల లోన్ టెన్యూర్ పెట్టుకోవాలనుకుంటే, నెలకు రూ. 17,162 EMI చెల్లించాలి. ఈ 48 నెలల్లో బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 1,34,118 అవుతుంది.
ఈ లెక్క ప్రకారం... మీరు నెలకు రూ. 11,095 చొప్పున చెల్లిస్తే 7 సంవత్సరాల్లో లోన్ క్లియర్ అవుతుంది. లేదా, నెలకు రూ. 12,431 చొప్పున కట్టుకుంటూ వెళ్లినా ఆరేళ్లలో రుణం తీరిపోతుంది. ఐదేళ్లలోనే లోన్ క్లోజ్ చేయాలనుకుంటే, నెలకు 14,316 EMI చెల్లించాలి.
బ్యాంక్ ఇచ్చే రుణం, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, బ్యంక్ విధానంపై ఆధారపడి ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ డౌన్‌పేమెంట్ చేయగలిగితే మీకు అంత మంచిది.
MG కామెట్ EV ఫీచర్లు & పనితీరుMG కామెట్ EV ఫీచర్లు & పనితీరు పరంగా కూడా చాలా బాగుంది. ఇది ఒక కాంపాక్ట్ 4-సీటర్ ఎలక్ట్రిక్ కారు. ప్రత్యేకంగా నగరాల్లో డ్రైవింగ్ కోసం డిజైన్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారులో 17.3 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది, దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కి.మీ. వరకు నడుస్తుంది. ఈ కారు AC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
భద్రత & సాంకేతికతప్రయాణీకుల భద్రత కోసం MG కామెట్ EV లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు ఇచ్చారు. వెనుక పార్కింగ్ కెమెరా కూడా ఉంది. ఇందులో పవర్-ఫోల్డింగ్ ORVMలు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ & డిస్క్ బ్రేక్‌లతో ABS + EBD వంటి లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి దీన్ని మరింత సురక్షితమైన కారుగా మార్చాయి.