Maruti Suzuki Victoris | మారుతి సుజుకీ విక్టారిస్ ధరలను ప్రకటించింది. ఈ SUV ధర రూ. 10.50 లక్షల నుంచి ప్రారంభమై రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. ఇందులో పెట్రోల్, మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG వేరియంట్‌లు ఉన్నాయి. మారుతి సుజుకీ SUV బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. బుక్ చేసుకున్న తర్వాత, డెలివరీ కోసం సోమవారం (సెప్టెంబర్ 22) వరకు వేచి ఉండాలి.

Maruti Victoris ఎన్ని వేరియంట్‌లు ఉన్నాయి?

Strong Hybrid: మీరు మైలేజ్, లేటెస్ట్ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, Victoris స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ మీకు బెస్ట్ ఛాయిస్. దీని ధర రూ. 16.3 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 20 లక్షల కంటే తక్కువనే ఉంటుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ Victoris అత్యంత శక్తివంతమైన వేరియంట్. మీరు దీన్ని ఎలక్ట్రిక్ మోడ్‌లో కూడా డ్రైవ్ చేయవచ్చు. దీని ఇంధన సామర్థ్యం చాలా ఎక్కువ. కనుక ఇది దీర్ఘకాలంలో మీ డబ్బుకు విలువైన ఎంపికగా నిరూపితం అవుతుంది.

Mild Hybrid Automatic: మీ బడ్జెట్ కొంచెం తక్కువగా ఉన్నట్లయితే, కానీ మీరు ఫీచర్-రిచ్ SUV ని కొనాలని భావిస్తున్నారా.. మైల్డ్ హైబ్రిడ్ ఆటోమేటిక్ వేరియంట్ మీకు బెస్ట్ ఛాయిస్. ఈ వేరియంట్ స్ట్రాంగ్ హైబ్రిడ్ అంత సమర్థవంతమైనది కాదు. కానీ పనితీరు, ధర పరంగా ఇది బెటర్. దీని ధర రూ. 13.3 లక్షల నుంచి 17.7 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇది మిడ్ రేంజ్ కొనుగోలుదారులకు మంచి కారు ఎంపిక.

ఏ వేరియంట్ చౌకైనది? 

ఇంధన పొదుపునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కొనుగోలుదారులకు CNG వేరియంట్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇది టాప్-ఎండ్ మోడళ్లలో అందుబాటులో లేనప్పటికీ, ఇది మంచి ఫీచర్లతో వచ్చింది. దూర ప్రయాణాలు చేసే డ్రైవర్లకు CNG Victoris చాలా చౌకైన ఎంపిక, అయితే ఇందులో ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ లేదు.

మారుతి ఈసారి Victorisలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎంపికను అందించింది. ఈ ఫీచర్ ముఖ్యంగా అడ్వెంచర్, ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారికి హెల్ప్ అవుతుంది.  ముఖ్యమైన విషయం ఏమిటంటే, AWD వేరియంట్ మొదట్నుంచీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది వెహికలల్ డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు.