Maruti Swift on EMI: మారుతి సుజుకి అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో స్విఫ్ట్ ఒకటి. ఈ కారు కొత్త తరం మోడల్‌ను ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. కొత్త మారుతి స్విఫ్ట్ రూ.6.49 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు టాప్ మోడల్ ధర రూ.9.59 లక్షలుగా ఉంది. ఈ మారుతి కారును ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ రెండు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.


ఈఎంఐలో మారుతి స్విఫ్ట్‌ని ఎలా కొనుగోలు చేయాలి?
ఢిల్లీలో మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ.7.31 లక్షలుగా ఉంది. దేశంలోని ఇతర నగరాల్లో ఈ ధరలో వ్యత్యాసం కనిపిస్తుంది. మీరు ఈ స్విఫ్ట్ మోడల్‌ని లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే లక్ష రూపాయల కంటే తక్కువ డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ కారు కోసం బ్యాంకు నుంచి రూ.6.58 లక్షల రుణం పొందవచ్చు. కారు లోన్ పొందడానికి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండాలి. 



Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!


కొత్త మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి మీరు కనీసం రూ. 73,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఈ రుణంపై విధించే వడ్డీ ప్రకారం ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.


మారుతి స్విఫ్ట్‌ను కొనుగోలు చేయడానికి కారు లోన్‌పై బ్యాంకు తొమ్మిది శాతం వడ్డీని వసూలు చేసి, మీరు నాలుగేళ్ల కాలవ్యవధితో లోన్ తీసుకుంటే ప్రతి నెలా బ్యాంకులో రూ.16,380 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.


అదే ఐదేళ్ల పాటు లోన్ తీసుకుంటే మీరు ప్రతి నెలా దాదాపు రూ. 13,700 EMI డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.


అదే రుణాన్ని ఆరేళ్లపాటు తీసుకుంటే 9 శాతం వడ్డీతో ప్రతినెలా రూ.11,900 బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.


మీరు ఏడేళ్ల పాటు రుణం తీసుకుంటే ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం రూ.10,600 అవుతుంది.


బ్యాంక్ పాలసీ ప్రకారం మారుతి స్విఫ్ట్ కోసం తీసుకున్న లోన్ మొత్తంలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. రుణం తీసుకునే ముందు బ్యాంకు పాలసీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందడం ముఖ్యం.



Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?