Maruti Suzuki Swift: మారుతి సుజుకి తన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ధరలను వేరియంట్‌ను బట్టి రూ.15,000 నుంచి రూ. 39,000 వరకు పెంచింది. నెక్స్ట్ జనరేషన్ స్విఫ్ట్ రాబోయే కొద్ది వారాల్లో భారతదేశంలోకి రానుంది. ఇప్పుడు ఈ కార్ల ధరలను కంపెనీ తగ్గించింది.


దేని ధర ఎంత పెరిగింది?
మారుతి స్విఫ్ట్ మాన్యువల్ వెర్షన్ జెడ్ఎక్స్ఐ+ వేరియంట్ ధర రూ.39,000 పెరిగింది. VXi, VXi AMT, VXi CNG వేరియంట్‌ల ధర రూ. 15,000 పెరిగింది. కాగా ZXI, ZXI AMT, ZXI+ వేరియంట్‌ల ధరలు రూ.25,000 పెరిగాయి.


ధర పెరిగినప్పటికీ మారుతి స్విఫ్ట్‌ ఫీచర్లలో ఎటువంటి మార్పులు లేవు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. అదే 90 హెచ్‌పీ, 113 ఎన్ఎం, 1.2 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!


ప్రస్తుత తరం స్విఫ్ట్ ధరలో ఈ పెరుగుదల దాదాపు ఒక నెల వరకు ఉంటుంది. దాని తర్వాతి తరం మోడల్ 2024 మే మధ్య నాటికి లాంచ్ కానుంది. కొత్త వేరియంట్ వచ్చాక పాత మోడల్ ధర మళ్లీ తగ్గుతుందా? లేకపోతే ఇలాగే ఉంటుందా? అన్నది తెలియరాలేదు.


2024 స్విఫ్ట్‌లో మారుతి అతిపెద్ద లాంచ్‌లలో ఒకటిగా ఉంటుంది. ఈ ఏడాది చివర్లో కొత్త డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ కూడా లాంచ్ కానుంది. కొత్త మారుతి స్విఫ్ట్ కొత్త డిజైన్, కొత్త ఇంటీరియర్, కొత్త 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది.


కొత్త స్విఫ్ట్ వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీనికి సంబంధించిన అన్ని వేరియంట్‌ల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నారు. అయితే కొత్త తరం స్విఫ్ట్ ఏ ధరకు లాంచ్ కానుందనేది ఆసక్తికరంగా మారింది.


Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?