Maruti Suzuki Hustler Mini SUV: టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ ఎస్‌యూవీల్లో ఒకటి. మారుతి సుజుకి తన కొత్త కారుతో ఈ ఎస్‌యూవీకి పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. మారుతి సుజుకి హజ్లర్ భారతదేశంలోని రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది. కంపెనీ ఈ కారును చాలా కాలంగా తన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ కారు భారత మార్కెట్లోకి ప్రవేశించలేకపోయింది.
టెస్టింగ్‌లో కనిపించిన హజ్లర్
మారుతి సుజుకి హజ్లర్ టెస్ట్ మ్యూల్ భారతదేశంలో టెస్టింగ్‌లో కనిపించింది. ఈ కారు మనదేశంలో ఢిల్లీ రోడ్లపై కనిపించింది. ఈ టెస్ట్ మ్యూల్‌లో సుజుకి లోగో, హజ్లర్ పేరు కనిపించలేదు. తద్వారా ఈ కారు ఐడెంటిటీని దాచింది. ఇది కాకుండా టైర్లపై కనిపించే సుజుకి లోగోను టెస్టింగ్ మ్యూల్‌పై కూడా కవర్ చేశారు.
సుజుకి లోగో, హజ్లర్ బ్రాండ్ మినహా మొత్తం కారును వెల్లడించలేదు. ఈ కారు డ్యూయల్ టోన్ స్కీమ్‌తో టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ కారు లైట్ వైట్/సిల్వర్ షేడ్‌తో రోడ్డుపైకి వచ్చింది. ఈ కారు పైకప్పు డార్క్ గ్రే కలర్‌లో కనిపించింది.
Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్
ఈ సుజుకి కారు భారతదేశంలో లాంచ్ అవుతుందా?
మారుతి సుజుకి హజ్లర్ ఒక టాల్ బాయ్ కారు. ఈ కారు పొడవు 3,395 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1,475 మిల్లీమీటర్లుగా ఉంది. మన దేశ ప్రజల అభిరుచికి అనుగుణంగా ఈ కారు చాలా చిన్నది. మారుతి సుజుకి ఈ కారును భారత మార్కెట్లోకి తీసుకువస్తే భారతీయ మార్కెట్ ప్రకారం సైజు కొంచెం పెద్దగా ఉండాలి.
ఆటో పరిశ్రమ విక్రయాల ప్రకారం నాలుగు మీటర్ల లోపు పొడవున్న 7 సీటర్ కారు భారతీయ మార్కెట్లోకి వచ్చాక ప్రజలను మెప్పించడం కొంచెం కష్టమైన పని అని చెప్పాలి. ఈ కారు భారత మార్కెట్లోకి వస్తే టాటా పంచ్‌కు మంచి పోటీని ఇవ్వవచ్చు.
మనదేశంలో బడ్జెట్ కార్ల విషయంలో మారుతి సుజుకి నంబర్ వన్ అని చెప్పవచ్చు. కానీ గత కొంతకాలంగా రూ.10 లక్షల్లోపు మార్కెట్లో మారుతి సుజుకి కార్లకు టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోల దగ్గర నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో మారుతి సుజుకి ఈ విభాగంలో తిరిగి పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది. ఆ ప్రయత్నాల నుంచే ఈ హజ్లర్ పుట్టిందని అనుకోవాలి.
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి