Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి ఇటీవల అరేనా, నెక్సా సిరీస్‌ల డీలర్‌షిప్‌లలో తన కార్ల ధరలను మార్చింది. అప్‌డేట్ చేసిన ధరల గురించిన సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ మారుతి గ్రాండ్ విటారా ధర అప్‌డేట్ గురించి తెలుసుకుందాం.


వీటి ధరలు పెరిగాయి
డెల్టా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, జీటా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా డ్యూయల్ టోన్ స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ సహా మారుతి గ్రాండ్ విటారా ఎంపిక చేసిన వేరియంట్‌ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. అయితే అన్ని ఇతర వేరియంట్‌లు అన్నీ రూ.10,000 వరకు పెరిగాయి.


ధర ఎంత?
గ్రాండ్ విటారా మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్‌లకు పోటీగా ఉంది, దీని ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 10.80 లక్షల నుంచి రూ. 20.09 లక్షల మధ్య ఉంది. ఈ మోడల్ 10 రంగులు, రెండు ఇంజన్ ఆప్షన్లు, నాలుగు వేరియంట్లలో పరిచయం చేశారు. ఇది కాకుండా  ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీకి సంబంధించిన ఏడీఏఎస్ వేరియంట్‌పై కూడా పని జరుగుతోంది. మీరు ఈ నెలలో దీన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ నెలలో దానిపై రూ.75,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.


ఫీచర్లు ఎలా ఉంటాయి?
మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్ అప్ డిస్‌ప్లే ఉన్నాయి. గ్రాండ్ విటారాలోని సేఫ్టీ కిట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఈబీడీతో కూడిన ఏబీఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి. ఇది కాకుండా 360 డిగ్రీ కెమెరా, హిల్ డీసెంట్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్‌ను కూడా కలిగి ఉంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!