Discount on Maruti Suzuki Car: మారుతి సుజుకి తన పాపులర్ ఎస్‌యూవీపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తుంది. కంపెనీ గతంలో ఈ వాహనం ధరను రూ.10,000 పెంచింది. కానీ ఇప్పుడు మారుతి సుజుకి ఈ మోడల్‌పై రూ.80 వేల వరకు వివిధ ఆఫర్లను అందిస్తోంది. మారుతి ఈ మోడల్‌పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ రెండింటినీ అందిస్తోంది. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ కేవలం మార్చి నెలకు మాత్రమే పరిమితం చేసింది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారాపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మోడల్‌పై కంపెనీ రూ.80 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. దీనిపై రూ.30 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. ఇది కాకుండా ఈ వాహనంపై రూ. 50 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ కేవలం మార్చి నెలకు మాత్రమే పరిమితం. మీరు కారు కొనే ఊరికి అనుగుణంగా ఈ ఆఫర్‌లో కొన్ని మార్పులు కనిపించవచ్చు.
గత నెలలో, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ధరను రూ.10,000 పెంచింది. ఇది కాకుండా మారుతి అనేక ఇతర మోడళ్ల ధరలను రూ.10,000 పెంచింది. కంపెనీ డెల్టా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, జీటా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా డ్యూయల్ టోన్ స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
పోటీ దీనితోనే...
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ప్రత్యర్థి కారు టయోటా హైరైడర్. టయోటా హైరైడర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.14 లక్షల నుంచి మొదలయి రూ. 20.19 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్ nexaexperience.com ప్రకారం మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎక్స్ షోరూమ్ ధర రూ.10.80 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఈ కారు 27 కిలోమీటర్ల మైలేజీని అందించడం విశేషం. ఈ బలమైన హైబ్రిడ్ వేరియంట్‌పై కంపెనీ అత్యధిక తగ్గింపును అందిస్తుంది.