Maruti Suzuki Fronx SUV: 2023 ఏప్రిల్‌లో మనదేశంలో లాంచ్ అయిన తమ ఫ్రాంక్స్ క్రాస్ఓవర్ ఎస్‌యూవీ విక్రయాల గురించి మారుతి సుజుకి సమాచారం ఇచ్చింది. ఈ కారు ఇప్పటికే లక్ష యూనిట్లను దాటేసింది. కేవలం తొమ్మిది నెలల్లోనే ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కారుగా అవతరించింది. గ్రాండ్ విటారా కంటే ఫ్రాంక్స్ ఎస్‌యూవీ రెండు అడుగులు ముందుంది. ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ వాటా 2022లో 10.4 శాతం నుంచి 2023లో 19.7 శాతానికి పెరిగింది. ఈ సేల్స్‌ను దాదాపుగా రెట్టింపు చేయడంలో ఫ్రాంక్స్ కీలక పాత్ర పోషించింది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్ 100 హెచ్‌పీ పవర్, 147 ఎన్ఎం పీక్ టార్క్‌ను, 90 హెచ్‌పీ పవర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను జనరేట్ చేస్తుంది. టర్బో పెట్రోల్ మోటారును 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో పెయిర్ అవ్వవచ్చు. రెండోది 5 స్పీడ్ మాన్యువల్ వేరియంట్, 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను పొందుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఏకైక మోడల్. ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది.
2023 జూలైలో మారుతి దీన్ని సీఎన్‌జీ వేరియంట్‌తో లాంచ్ చేసింది. దీనిలో అదే 1.2 లీటర్ మోటార్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 77.5 హెచ్‌పీ, 98.5 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇప్పటివరకు విక్రయించిన లక్ష యూనిట్ల గురించి చెప్పాలంటే 20 శాతం అమ్మకాలు సీఎన్‌జీ మోడల్స్. అంటే 20,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి అన్నమాట. అయితే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఐదు నుంచి ఏడు శాతం అమ్మకాలను అందించింది. చాలా యూనిట్లు 1.2 లీటర్ మాన్యువల్ వేరియంట్‌లో మార్కెట్లోకి వచ్చాయి.
ధర ఎంత?
కంపెనీ ఈ ఎస్‌యూవీని తన ప్రీమియం అవుట్‌లెట్ నెక్సా ద్వారా విక్రయిస్తుంది. ఫ్రాంక్స్ క్రాసోవర్‌ను రూ.7.47 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే దాని టాప్ ఆఫ్ ది లైన్ జీటా టర్బో పెట్రోల్ 6ఏటీ ట్రిమ్ కోసం మీరు రూ. 12.06 లక్షలు (ఎక్స్ షోరూమ్) చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో సీఎన్‌జీ వేరియంట్ కోసం మీరు రూ. 8.42 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఖర్చు చేయాలి.
మరోవైపు భారతీయ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ఇటీవలే దేశంలో కొత్త పంచ్ ఈవీని లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్‌కు సంబంధించి డిజైన్, ఇంటీరియర్‌లో అనేక మార్పులు చేశారు. టాటా పంచ్ ఐసీఈ వెర్షన్‌లో కూడా ఇలాంటి మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రానున్న 14-15 నెలల్లో దేశంలో లాంచ్ కానుందని చెప్పవచ్చు. అంటే ఇది 2025 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్న మాట.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!